
జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. పూంచ్ ప్రాంతంలో ఒక కారు ప్రయాణిస్తూ వెళ్లి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
పూంచ్‌లోని పోలీసు కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సురన్‌కోట్‌లోని మర్హా ప్రాంతంలోని వివాహ వేడుకకు హాజరైన కొందరు వ్యక్తులు గురువారం సాయంత్ర ఓ కారులో బఫ్లియాజ్‌కు తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో ఈ కారు టార్రారన్ వాలీలో నిటారుగా ఉన్న లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే అధికారులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదానికి గురైన వారంత పెళ్లి వేడుకలకు హాజరై తిరిగి వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇలాంటి ప్రమాదమే ఐదు రోజుల కిందట ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. శుభకార్యానికి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిదిమంది అక్కడికక్కడే చెందారు. దాదాపు 54మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయమయ్యింది. ఆదివారం) తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేసారు. ఇందుకోసం వేణు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఓ ప్రైవేట్ బస్సులో చిత్తూరుకు బయలుదేరారు.
ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో భాకరావుపేట ఘాట్ రోడ్డుపై వెళుతుండగా దొనకోటి గంగమ్మ దేవాలయం సమీపంలోని బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఓ మలుపు వద్ద ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా మలుపు రావడంతో డ్రైవర్ బస్సును అదుపుచేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 60మందికి పైగా వున్నారు. వీరిలో తొమ్మిదిమంది అక్కడిక్కడే మృతిచెందగా మరో 54మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బస్సు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా పోలీసులు క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.