మాజీ భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందే.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు...

Published : Apr 01, 2022, 10:15 AM IST
మాజీ భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందే.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు...

సారాంశం

ముంబై హైకోర్టు ఓ సంచలన తీర్పును ఇచ్చింది. భార్యను చదివించి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేసిన భర్తకు.. ఆ భార్య భరణం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ విడాకుల కేసులో ఈ మేరకు తీర్పు నిచ్చింది. 

ముంబై : భార్యభర్తల విడాకుల కేసులో.. భరణం చెల్లింపు విషయంలో బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్త భార్యకు భరణం ఇవ్వడం మామూలే.. అయితే ఇక్కడ సంపాదనపరురాలైన భార్యే భర్తకు భరణం ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. తన మాజీ భర్తకు Maintenance చెల్లించాలని మహారాష్ట్రలోని Nanded Court ఇచ్చిన ఆదేశాలను Bombay High Court సమర్థించింది. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళ తన మాజీ భర్తకు నెలకు మూడు వేల రూపాయలు చెల్లించాలని సివిల్ కోర్టు ఆదేశించింది. మహిళ పనిచేస్తున్నపాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతి నెల ఆమె జీతం నుంచి ఐదు వేల రూపాయలు మినహాయించాలని దానిని పాత బకాయిల కింద కోర్టులో డిపాజిట్ చేయాలని కోర్టు కోరింది.  2015 సంవత్సరంలో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు భార్య కోర్టులో వాదించింి. విడాకుల తర్వాత భార్య భర్తకు ఎలాంటి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మహిళ తరఫు న్యాయవాది వాదించారు.

వివాహం అనంతరం తన భార్యను చదివించి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చేలా చేశానని, ఇప్పుడు తనకు ఎలాంటి ఆదాయవనరులు లేవని, తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని భర్త చెప్పారు. హిందూ వివాహ చట్టంలోని 24, 25 సెక్షన్ల కింద నిరుపేద జీవిత భాగస్వామికి భరణం క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పిస్తున్నామని, దిగువ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ  బాంబే హైకోర్టు జస్టిస్ డాంగ్రే ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో ఓ భార్య తన భర్త నుంచి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 52 వేల కోట్లు Maintenance ఇప్పించాలంటూ Britain లో కోర్టును ఆశ్రయించారు. ఆమె ఒక బిలియనీర్ మాజీ భార్య.  Russiaలో అత్యంత సంపన్నుల జాబితాలో Vladimir Potanin ది రెండోస్థానం. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.2.25 లక్షల కోట్లు. 31 ఏళ్ల కాపురం తర్వాత భార్య నటాలియా పొటానినా నుంచి ఆయన విడాకులు తీసుకున్నారు.

విడాకుల సమయంలోనే ఆమెకు కొంత భరణం అందించారు. అయితే తనకు భరణం విషయంలో అన్యాయం జరిగిందని.. మరింత సొమ్ము ఇప్పించాలని తాజాగా లండన్లోని కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ తయారీ కంపెనీ MMC Norilsk PJSCలో వ్లాదిమిర్ కు ఉన్న వాటాలో 50% తనకు ఇప్పించాలని విన్నవించారు.  ప్రస్తుత లెక్కల ప్రకారం 52.8 వేల కోట్ల పై మాటే అని సమాచారం. దాంతోపాటు రష్యాలో వ్లాదిమిర్ కు ఉన్న మరికొన్ని ఆస్తులనూ ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లండన్లోని విడాకుల కోర్టులు గతంలో పలు కేసుల్లో భారీ మొత్తాల్లో భరణాలను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి. 

ఆస్తుల్లో భార్య-భర్తలకు దాదాపు సమాన వాటా ఉండేలా కూడా తీర్పులిచ్చాయి. ఈ నేపథ్యంలో పొటానినాకు అనుకూలంగా తీర్పు రావడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే... అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రూ. 2.7 లక్షల కోట్లు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 1.96 లక్షల కోట్ల తర్వాత అత్యధిక భరణం ఇవ్వనున్న వ్యక్తిగా వ్లాదిమిర్ రికార్డు ఎక్కుతారు. 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu