రాజస్థాన్ లో ఘోరరోడ్డు ప్రమాదం:8మంది మృతి

Published : Oct 13, 2018, 06:06 PM IST
రాజస్థాన్ లో ఘోరరోడ్డు ప్రమాదం:8మంది మృతి

సారాంశం

రాజస్థాన్ లో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.   

రాజస్థాన్: రాజస్థాన్ లో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

వివరాల్లోకి వెళ్తే ఉదయ్ పూర్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులు సాలుంబార్ ప్రాంతానికి పిక్నిక్ బయలు దేరారు. అయితే ఖైరాద్ సమీపంలో కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. 

మృతిచెందిన వారిలో ముగ్గురు చిన్నారులు, పాఠశాల యజమాని ఉన్నారు. వీరితోపాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సాలూంబార్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?