Cancellation of OLA Ride: OLA, UBER క్యాబ్ డ్రైవర్ల‌కు షాక్ ! ఇక‌ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు చెక్ 

Published : Jul 14, 2022, 02:22 PM IST
Cancellation of OLA Ride: OLA, UBER క్యాబ్ డ్రైవర్ల‌కు షాక్ ! ఇక‌ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు చెక్ 

సారాంశం

Cancellation of OLA Ride: OLA, UBER క్యాబ్ డ్రైవర్ల ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు కేంద్రం చెక్ పెట్టింది. క్యాబ్ డైవ‌ర్ల‌పై ఫిర్యాదులు పెర‌గ‌డంపై  CCPA, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క్యాబ్ అగ్రిగేటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Cancellation of OLA Ride: ఇక‌నుంచి  OLA, UBER క్యాబ్ డ్రైవర్ల ఏకపక్షంగా నిర్ణ‌యాల‌కు చెక్ ప‌డింది.  ఎటువంటి కారణం లేకుండా.. క్యాబ్ రద్దు చేసే వారిపై క‌ఠిన‌ చర్యలు తీసుకోబడుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా, ఓలా ఉబర్ వంటి క్యాబ్ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇష్టానుసారంగా వ్యవహరించే   క్యాబ్‌ డ్రైవర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించ‌నున్న‌ది. 

క్యాబ్ కంపెనీలపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో CCPA, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క్యాబ్ అగ్రిగేటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 
సరైన కారణం లేకుండా కస్టమర్ బుక్ చేసిన రైడ్‌ను క్యాబ్ డ్రైవర్ రద్దు చేస్తే. అత‌ని పై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే CCPA నగదు చెల్లింపుల‌పై కూడా కీల‌క చ‌ర్య‌లు తీసుకుంది.  కేవ‌లం ఆన్ లైన్ మోడ్ లో చెల్లించాల‌ని స్ప‌ష్టం చేసింది. 

గత కొద్ది రోజులుగా..  ఓలా, ఉబర్ వంటి క్యాబ్ కంపెనీలపై CCPA కి అనేక ఫిర్యాదులు అందాయి. మరీ ముఖ్యంగా, అనవసర రైడ్‌ల రద్దు, అధిక ఛార్జీలు వసూలు చేయడం, వాహనంలో ఏసీ పనిచేయకపోవడం వంటి ప‌లు కారణాలపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల‌పై  చర్యలు తీసుకోవాలని CCPA నిర్ణయించింది. తదనంతరం, ఫిర్యాదులను పరిష్కరించడానికి కంపెనీలను మే 10, 2022న సమావేశం నిర్వహించాలని CCPA కోరింది. ఫిర్యాదులపై స్పందించాలని కంపెనీలను కూడా కోరింది.

ప‌లు మీడియా కథనాల ప్రకారం.. ఇక నుంచి వినియోగదారుల నుండి ఇష్టానుసారంగా అధిక ఛార్జీలు వసూలు చేసినా లేదా లొకేషన్ అడిగిన తర్వాత రైడ్‌లను రద్దు చేసే క్యాబ్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ క్యాష్ మోడ్‌లో ఏ కస్టమర్ నుండి డబ్బు తీసుకోడు. డ్రైవర్ ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఈ నిబంధనలను పాటించని కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?