నలుగురు ఎల్ఈటీ ఉగ్రవాదుల మరణశిక్ష రద్దు.. పదేళ్ల జైలు శిక్షగా కుదింపు- కలకత్తా హైకోర్టు తీర్పు..

By team teluguFirst Published Nov 15, 2022, 12:41 PM IST
Highlights

దేశంపై యుద్ధం చేసిన కేసులో మరణ శిక్ష పడిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను విడుదల చేయాలని కలకత్తా హైకోర్టు సోమవారం ఆదేశించింది. అయితే ఇతర నేరాలకు సంబంధించి కోర్టు నలుగురికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 

నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల మరణశిక్షను కలకత్తా హైకోర్టు జైలుగా మార్చింది. జస్టిస్ జైమాల్యా బాగ్చీ, జస్టిస్ అనన్య బందోపాధ్యాయలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మరణశిక్ష నుండి తప్పించుకున్న ఈ ఉగ్రవాదుల పేర్లు షేక్ నయీమ్, షేక్ అబ్దుల్లా అలియాస్ అలీ, మహ్మద్ యూనస్, మహ్మద్ అహ్మద్ రాథర్. ఇందులో  షేక్ నయీమ్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా.. షేక్ అబ్దుల్లా, మహ్మద్ యూనస్‌లు పాకిస్థాన్‌కు చెందినవారు. మహ్మద్ అహ్మద్ రాథర్ కాశ్మీర్‌కు చెందిన వ్యక్తి. 

మరోసారి తెరమీదకి వచ్చిన మరాఠా రిజర్వేషన్ పోరాటం.. సుప్రీంను ఆశ్రయించనున్న 'మహా' సర్కార్

షేక్ నయీమ్ మరణశిక్షను 10 ఏళ్ల జైలు శిక్షగా మార్చగా, షేక్ అబ్దుల్లా, మహ్మద్ యూనస్ పాకిస్థాన్, మహ్మద్ అహ్మద్ రాథర్‌లకు ఐదేళ్ల జైలు శిక్షను తగ్గించారు. షేక్ నయీమ్‌కు రూ. 25 వేల జరిమానా విధించగా.. మిగిలిన ముగ్గురికి కూడా రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ ఉగ్రవాదులు జైలులో గడిపిన రోజుల సంఖ్యను శిక్షా కాలం నుండి తగ్గించాలని హైకోర్టు పేర్కొంది.

ప్రపంచ జనాభా 800 కోట్లు.. వచ్చే ఏడాది వరకు భారత్ టాప్.. క్రమంగా పెరుగుతున్న ఆయుఃప్రమాణం

అయితే ఈ కోణంలో అందరి శిక్షలు పూర్తయ్యాయి. కానీ ఢిల్లీ కోర్టులో షేక్ నయీమ్‌పై విచారణ జరుగుతున్నందున, అతడు ఇంకా విడుదలయ్యే అవకాశం లేదు. మహ్మద్ అహ్మద్ రాథర్ కూడా త్వరలో విడుదల కావచ్చు.

2007లో బెంగాల్‌తో బంగ్లాదేశ్ సరిహద్దులోని పెట్రాపోల్ ప్రాంతంలోని ఒక పాడుబడిన ఇంటి నుండి సరిహద్దు భద్రతా దళం (BSF) నలుగురిని అరెస్టు చేసింది. వారి నుంచి భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలు, భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల మ్యాప్‌లు స్వాధీనం చేసుకుంది. వారిపై 2012లో బంగావ్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆ కోర్టు వారికి మరణశిక్ష విధించింది.

ఉక్రెయిన్‌ వివాదాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలి - జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ

ఈ నిర్ణయాన్ని వారు కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. దీనిపై తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. దొరికిన సాక్ష్యాలను బట్టి ఈ నలుగురు ‘సైనికులు’ అని, ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యులు కాదని బెంచ్ పేర్కొంది. వారు అత్యాశతో లేదా ఒత్తిడితో ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని భావించింది. 

click me!