ఒడిశాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి..20 మందికి  తీవ్ర గాయాలు

Published : Sep 17, 2022, 04:11 AM IST
ఒడిశాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి..20 మందికి  తీవ్ర గాయాలు

సారాంశం

ఒడిశాలోని జార్సుగూడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.ఈ ప్రమాదంలో ఓ ప్రైవేట్ స్టీల్ అండ్ పవర్ ప్లాంట్‌కు చెందిన బ‌స్సును ఓ ట్ర‌క్కు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌నలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.

ఒడిశాలో ఘోర రోడ్డు  ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో  ఆరుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం..ఒడిశాలోని జార్సుగూడ-సంబల్‌పూర్ బిజు ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. జార్సుగూడ బైపాస్ రోడ్డులోని పవర్ హౌస్ చక్ సమీపంలో బొగ్గుతో కూడిన ట్రక్కు బస్సును ఢీకొట్టింది. బస్సు జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్‌ నుంచి జార్సుగూడ పట్టణానికి ఉద్యోగులను తీసుకువెళుతోంది.
 
ఈ ప్ర‌మాదంలో  ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో 20 మంది   తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 10 మందిని సంబల్‌పూర్‌లోని బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ (విమ్సార్)కి తరలించారు. మ‌రికొంద‌రూ  స్థానిక ఆస్ప‌త్రిలో  చికిత్స పొందుతున్నారని జార్సుగూడ SDPO నిర్మల్ మహపాత్ర తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !