బురారీ సామూహిక మరణాలు: విస్తుపోయే మరిన్ని విషయాలు

First Published Jul 5, 2018, 7:46 AM IST
Highlights

ఢిల్లీలోని సామూహిక ఆత్మహత్యల కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఆ కుటుంబం నివసిస్తున్న ఎదురింటి సీసీటీవీ ఫుటేజీలో ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు సిద్ధమవుతున్న దృశ్యాలు కనిపించాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సామూహిక ఆత్మహత్యల కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని ఓ ఇంట్లో 11 మంది కుటుంబ సభ్యులు ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

ఆ కుటుంబం నివసిస్తున్న ఎదురింటి సీసీటీవీ ఫుటేజీలో ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు సిద్ధమవుతున్న దృశ్యాలు కనిపించాయి. ఉరి వేసుకోవడానికి అవసరమైన స్టూల్స్, వైర్లు తీసుకుని వస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. 

కుటుంబం 11 ఏళ్ల పాటు 11 డైరీలను ఉపయోగించారు. 11 మంది ఉరి వేసుకోవడానికి ఆ సంఖ్య సంకేతాలను ఇస్తోంది. కప్ లో నీళ్లు ఉంచాలని, ఆ నీళ్ల రంగు మారితే నీవు రక్షింపబడుతావు వంటి రాతలు డైరీల్లో రాసి ఉన్నాయి. 

తాము మరణించబోమని, ఆకాశం ఉరుముతుందని, భూమి కంపిస్తుందని, తమను అవి రక్షిస్తాయని కుటుంబ సభ్యులు భావించినట్లు తెలుస్తోంది. 

ఇంటి పెద్ద కోడలు సవిత,త ఆమె కూతురు నీతు ఐదు స్టూల్స్ ను తెస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపించాయి. వాటిని ఉరి వేసుకోవడానికి వాడారు. కుటుంబంలోని చిన్నవాళ్లు ధ్రువ్, శివమ్ రాత్రి 10.15 గంటల సమయంలో ప్లై వుడ్ షాప్ నుంచి ఎలక్ట్రిక్ వైర్లు తెస్తున్న దృశ్యాలు కూడా కెమెరాకు చిక్కాయి.  ఆ వైర్లను పది మంది ఉరి వేసుకోవడానికి ఉపయోగించారు. 

కుటుంబంలోని పది మంది ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించగా,77 ఏళ్ల కుటుంబ పెద్ద నారాయణ్ దేవి మరో గదిలో కింద పడి ఉన్న విషయం తెలిసిందే. మృతుల్లో నారాయణ్ దేవి కూతురు ప్రతిభ (57), ఆమె ఇద్దరు కుమారులు భవనేష్ (50), లలిత్ భాటియా (45) ఉన్నారు. భవనేష్ భార్య సవిత (48), ఆమె ముగ్గురు పిల్లలు మీను (23), నిధి (25), ధ్రువ్ (15) ఉరివేసుకుని మరణించినవారిలో ఉన్నారు.

లలిత్ భాటియా భార్య టీనా (42), వారి 15 ఏళ్ల కుమారుడు శివం మరమించాడు. ప్రతిభ కూతురు ప్రియాంక (33) గత నెలలో నిశ్చితార్థం జరిగింది. ఆమె కూడా ఉరివేసుకున్నవారిలో ఉంది.

click me!