ఢిల్లీ డెత్ మిస్టరీ: ఐదేళ్లుగా లలిత్ భాటియా మౌనవ్రతం, తండ్రి ఆదేశాల మేరకే ఇలా...

First Published Jul 3, 2018, 4:41 PM IST
Highlights

ఢిల్లీలో 11 మంది  డెత్ మిస్టరీ: లలిత్ భాటియానే కీలక సూత్రధారి?

న్యూఢిల్లీ: దేశ రాజధాని బురారీలోని ఓ ఇంట్లో 11 మంది అనుమానాస్పదస్థితిలో మరణించడం వెనుక  రహస్యాన్ని వెలికి తీసే పనిలో  పోలీసులు ఉన్నారు.  లలిత్ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే ఈ మరణాలకు కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. లలిత్ భాటియా చేతి రాతతో...  ఇంట్లో దొరికిన డైరీలోని రాతతో సరిపోలినట్టుగా పోలీసులు ప్రకటించారు.

77 ఏళ్ల  నారాయణ దేవి చిన్న కుమారుడు లలిత్‌ భాటియా. తనతో పాటు తన కుటుంబానికే చెందిన మరో 10 మంది సామూహిక ఆత్మహత్యలకు ప్రణాళిక రూపొందించింది కూడ ఇతనే అని  పోలీసులు అనుమానిస్తున్నారు.  కిరాణా దుకాణం నడుపుతున్న లలిత్‌ భాటియా ఐదేళ్ల నుంచి మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడు. 

కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చివరకు దుకాణానికి వచ్చిన వారితో కూడా మూగ సైగలు, చేతి రాతల ద్వారానే సంభాషించేవాడు. ఇలాంటిది ఉన్నట్టుండి గత కొంతకాలం నుంచి భాటియా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు.

పదేళ్ల క్రితం మరణించిన తన తండ్రి తనతో మాట్లాడాడడని లలిత్ భాటియా కుటుంబసభ్యులకు చెప్పేవాడు. తనకు సందేశాలు  ఇస్తున్నాడని ఆయన వారిని నమ్మించాడు. తన తండ్రి తనకు చెప్పినట్టుగా భ్రమించిన విషయాలను ఆయన రిజిష్టర్‌లో రాసి కుటుంబసభ్యులకు కూడ సమాచారాన్ని ఇచ్చేవాడు.

త్వరలోనే మీ ఆఖరు కోరికలు నెరవేరుతాయి, అప్పుడు ఆకాశం తెరుచుకొని భూమి కంపిస్తోందని .. ఆ సమయంలో ఎవరూ కూడ భయపడకూడదని  ఆయన  గట్టిగా మంత్రాన్ని జపిస్తే  తాను కాపాడుతానని తండ్రి తనకు చెప్పినట్టుగా లలిత్ భాటియా ఓ కాగితంలో రాసిన సమాచారం కుటుంబసభ్యులకు చూపించాడు.

లలిత్ భాటియా చెప్పిన విషయాలను నమ్మని ఇతర కుటుంబసభ్యులు కూడ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.లలిత్ భాటియా తాను నమ్మిన మూఢ నమ్మకాలతో కుటుంబసభ్యులను బలిగొనేలా చేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
 

click me!