ఢిల్లీలో కుప్పకూలిన భవనం:ఇద్దరు కార్మికుల మృతి

Published : Apr 25, 2022, 02:58 PM ISTUpdated : Apr 25, 2022, 10:13 PM IST
 ఢిల్లీలో కుప్పకూలిన భవనం:ఇద్దరు కార్మికుల మృతి

సారాంశం

ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. ఐదుగుురు కార్మికులు గాయపడ్డారు.   


న్యూఢిల్లీ: New Delhi నగరంలో సోమవారం నాడు నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భవన  నిర్మాణ పనులు చేస్తున్న  కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిాలాల కిందే ఇద్దరు కార్మికులు మరణించారు.ఈ విషయం తెలిసిన వెంటనే  రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు.

ఢిల్లీలోని Satya Niketan ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న Building కుప్పకూలింది.  సంఘటన స్థలానికి చేరుకొన్న అగ్ని మాపక సిబ్బంది సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ భవనం కుప్పకూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

భవనం కుప్పకూలిన విషయం సమాచారం అందిన వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించాయి.  పాత ఇంటికి మరమ్మత్తులు చేస్తున్న సమయంలో భవనం కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు.

మరో వైపు ఈ భవనం కూలిన విషయమై తమకు మధ్యాహ్నం 1:24 గంటలకు  సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.  నెల రోజుల క్రితం ఢిల్లీలోని కాశర్మీర్ గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు కార్మికులు గాయపడిన ఘటన జరిగి నెల రోజులు అవుతుంది. 

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వారి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 25 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తయిందని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. అయితే భవనం కుప్పకూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆయనతోపాటు జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం చాలా బాధాకరం. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తానే స్వయంగా పరిశీలిస్తున్నానని  అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం