బిల్డర్ కారును అడ్డగించి, కళ్లలో కారంపొడి చల్లి.. ఆపై దారుణంగా హత్య..

Published : Mar 17, 2022, 09:22 AM IST
బిల్డర్ కారును అడ్డగించి, కళ్లలో కారంపొడి చల్లి.. ఆపై దారుణంగా హత్య..

సారాంశం

ఓ బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ హత్య ఇప్పుడు కలకలం రేపింది. కారులో వెడుతున్న బిల్డర్ ను అడ్డగించి మరీ దారుణానికి తెగబడ్డారు. 

యశవంతపుర : బెళగావిలో మంగళవారం తెల్లవారుజామున ఓ బిల్డర్ దారుణ murderకు గురయ్యాడు. పట్టణంలోని గురుప్రసాద్ నగరలో నివాసం ఉంటున్న bulder రాజు దొడ్డబణ్ణవర (46) హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చూడటానికి ఆయన కారులో వెల్తుండగా దుండగులు కారును అడ్డగించి కారంపొడి చల్లి మారణాయుధాలతో నరికి పరారయ్యారు.

వివాహిత ఆత్మహత్య..
వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. బాగలకోటకు చెంది విద్యాశ్రీ (22)ని మూడేళ్ల క్రితం బెళగావికి చెందిన ఆనంద్ కు ఇచ్చి వివాహం చేశారు. హనూరు తాలూకా హౌగ్యం గ్రామపంచాయతీ పీడీఓగా పనిచేస్తున్న ఆనంద్ కొళ్లేగాలలో నివాసం ఉంటున్నారు. విద్యాశ్రీని కట్నం కోసం వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి తొమ్మిది నెలల చిన్నారి ఉంది. ఆనంద్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఎక్కువగా phone మాట్లాడుతోందని అత్త మందలించడంతో నవవధువు suicide చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. బోరబండలోని భరత్ నగర్ కు చెందిన పవన్ తో సికింద్రాబాద్ అడిక్ మెట్ కు చెందిన శిల్ప (22) మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అధికంగా ఫోన్ మాట్లాడటంపై అత్తాకోడళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో శిల్ప ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శిల్ప గర్భం దాల్చినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలే నిన్న, మొన్న కూడా రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త extra dowry తేవాలని వేధించడంతో ఓ married women కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కాంపెళ్లి మమత (24), రమేష్ లు ప్రేమించుకోగా 2018లో పెద్దలసమక్షంలో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాదిన్నరకి పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. కొన్నాళ్లకు harrasement మొదలయ్యాయి. దీంతో మమత సోమవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా తీవ్రగాయాలయ్యాయి. మొదట జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.  అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. 

దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు జగిత్యాల వచ్చి పాత బస్టాండ్ ఎదురుగా మధ్యాహ్నం మృతదేహంతో ఆందోళనకు దిగారు.  గంటసేపు ఆందోళన చేయగా డి.ఎస్.పి ఆర్ ప్రకాష్, పట్టణ సీఐ కే కిషోర్ వారితో మాట్లాడి ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా మమత భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. తన కుమార్తె మమత అత్తమామలు రాజవ్వ, లక్ష్మణ్. భర్త రమేష్,  బావ మహేష్ కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చారని మమత తల్లి నక్క సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

Dr KA Paul Speech: అమెరికా అసెంబ్లీలో కేఏ పాల్ స్పీచ్ | America Assembly | Asianet News Telugu
Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?