Tripura: కామంధుడిని చెట్టుకు కట్టేసి ప్రాణం తీసిన మహిళలు..

Published : Mar 17, 2022, 04:55 AM IST
Tripura: కామంధుడిని చెట్టుకు కట్టేసి ప్రాణం తీసిన మహిళలు..

సారాంశం

Tripura: త్రిపురలోని ధలై జిల్లాలో కొందరు మహిళలు ఓ కామాంధుడిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. చనిపోయిన వ్యక్తి ఓ అత్యాచార కేసులో నిందితుడు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలోని గండచెర్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  

Tripura: మ‌హిళ‌లు, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. దారుణమైన శిక్షలు విధించినా.. కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఆడవారు కనిపిస్తే చాలు.. చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా కండ్లు కామంతో మూసుక‌పోతున్నాయి.  దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా విద్యార్థులను విద్యాబుద్దులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు దుర్మార్గంగా వ్యవహరించాడు.

తండ్రి స్థానంలో ఉంది విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు దారి తప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప‌లుమార్లు  ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిపై త‌న కామ‌వాంఛ తీర్చుకుని తీరా.. గర్భ‌వ‌తిని చేశాడు ఈ ఘ‌ట‌న రాజస్థాన్​లోని జైపుర్​లో చోటు చేసుకుంది. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

పదో తరగతి చదువుతున్నవిద్యార్థిపై అత్యాచారానికి పాల్పడిన‌ స్కూల్​ యజమాని. ఆ అమ్మాయిని గర్భవతిని చేసిన వ్యక్తిని పురుషోత్తం శర్మగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని పేర్కొన్నారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం సంబంధిత సెక్షన్​లో కింద ముహనా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అనంతరం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

కామంధుడిని చెట్టుకు కట్టేసి ప్రాణం తీసిన మహిళలు..

త్రిపురలోని ధలై జిల్లాలో కొందరు మహిళలు ఓ కామాంధుడిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. చనిపోయిన వ్యక్తి ఓ అత్యాచార కేసులో నిందితుడు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలోని గండచెర్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. నిందితుడు ఇది వరకే ఓ హత్య కేసులో  దోహి. హత్య కేసులో ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్షను పూర్తి చేసుకుని గ‌త‌వార‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో మంగళవారం రాత్రి తన తల్లితో కలిసి మతపరమైన కార్యక్రమానికి వచ్చిన ఐదేళ్ల బాలికను సమీపంలోని అడవికి తీసుకెళ్లి అత్యాచారం పాల్ప‌డ్డాడు. బాలిక కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

నిందితుడి క‌ఠినంగా శిక్షించాల‌ని, నిందితుడిని వెంట‌నే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గండచెర్రా-అమర్‌పూర్ హైవేను దిగ్బంధించారు. అనంత‌రం బుధవారం తెల్లవారుజామున సమీపంలోని గ్రామంలో నిందితుడి ప‌ట్టుకున్నారు. దీంతో  చెట్టుకు కట్టేశారు మహిళలు. విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేశారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే స‌రైన న్యాయం అంటు కామెంట్స్ పెడుతున్నారు. ఘటనలపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu