Union budget 2022: మాన‌సిక ఆరోగ్యం కోసం టెలీ మెంట‌ల్ హెల్త్ ప్రొగ్రామ్: నిర్మలా సీతారామన్

Published : Feb 01, 2022, 03:42 PM IST
Union budget 2022: మాన‌సిక ఆరోగ్యం కోసం టెలీ మెంట‌ల్ హెల్త్ ప్రొగ్రామ్: నిర్మలా సీతారామన్

సారాంశం

Union budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..ప్రజల మానసిక ఆరోగ్యం కోసం జాతీయ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని వెల్ల‌డించారు.  

Union budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..ప్రజల మానసిక ఆరోగ్యం కోసం, జాతీయ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని వెల్ల‌డించారు. అలాగే, డిజిటల్ హెల్త్‌ రిజిస్ట్రీలు, ఆరోగ్య సౌకర్యాలు, ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు, ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించి ప్ర‌త్యేక ప్లాట్‌ఫామ్ ను సైతం అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. 

ప్రజల మానసిక ఆరోగ్యం కోసం తీసుకురాబోయే టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కు ఐఐటీ బెంగళూరు సాంకేతిక మద్దతు అందిస్తుందని చెప్పారు. అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ కోసం ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. దీంతో డిజిటల్ హెల్త్‌ రిజిస్ట్రీలు, ఆరోగ్య సౌకర్యాలు, ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు, ఆరోగ్య సౌకర్యాలకు ఇది సార్వత్రికంగా అందుబాటులో ఉంటాయ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)పేర్కొన్నారు.  బ‌డ్జెట్ ప్ర‌సంగా ప్రారంభంలోనే మంత్రి దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌, కోవిడ్‌-19 ప‌రిస్థితుల‌ను గురించి మాట్లాడారు. 

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని తెలిపారు. COVID-19 మహమ్మారి అన్ని వయసుల వారిలోనూ మానసిక ఆరోగ్య సమస్యలను పెంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఎత్తి చూపారు.“నాణ్యమైన మానసిక ఆరోగ్య సలహాలు, సంరక్షణ సేవలకు మెరుగైన ప్రాప్యత కోసం, జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభించబడుతుంది. ఇందులో 23 టెలీ-మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్‌వర్క్ ఉంటుంది. దీనితో నిమ్హాన్స్ (NIMHANS-National Institute of Mental Health and Neuro-Sciences) నోడల్ సెంటర్, IIIT బెంగళూరులు టెక్నాలజీ సపోర్టును అందించ‌నున్నాయి” అని  అర్థిక మంత్రి వెల్ల‌డించారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా 200,000 అంగన్‌వాడీ (anganwadi centres) కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు. “మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 వంటి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development) పథకాలను మా ప్రభుత్వం సమగ్రంగా పునరుద్ధరించింది. సక్షం అంగన్‌వాడీలు మెరుగైన బాల్య సంరక్షణను అందించే మెరుగైన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి. ఈ పథకం కింద రెండు లక్షల అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేస్తాం” అని  కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. గత సంవత్సరం, ప్రభుత్వం సక్షం పథకానికి రూ. 20,105 కోట్లు కేటాయించింది. ఇందులో నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి: ఐసిడిఎస్ (ICDS), పోషణ్ (Poshan), క్రెచ్‌లు (creches), కిశోర బాలికల పథకం( scheme for adolescent girls).

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu