కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం: బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్

By narsimha lodeFirst Published Feb 1, 2021, 10:40 AM IST
Highlights

కేంద్ర మంత్రివర్గ సమావేశం  సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. 

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం  సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. 

ఇవాళ ఉదయం పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ పద్దతిలో ఈ బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

 

కేంద్ర మంత్రివర్గ సమావేశం సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ పద్దతిలో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు pic.twitter.com/VJAFsV94tq

— Asianetnews Telugu (@AsianetNewsTL)

కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముందుగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. అక్కడి నుండి నేరుగా కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. పార్లమెంట్ భవనంలోనే కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. 

కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ బడ్జెట్  కు ఆమోదం తెలిపిన తర్వాత బడ్జెట్ ను  నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులను తన ట్యాబ్ ద్వారా మంత్రి చదివి విన్పిస్తారు.
 

click me!