కర్ణాటక విశ్వాస పరీక్ష ఎఫెక్ట్: ఓటువేయని బీఎస్పీ ఎమ్మెల్యేపై మాయావతి వేటు

By Nagaraju penumalaFirst Published Jul 23, 2019, 9:50 PM IST
Highlights

మ్మెల్యే ఎన్.మహేశ్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు గైర్హాజరు కావడంతో మాయావతి సీరియస్ అయ్యారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినందుకు అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. సంకీర్ణ ప్రభుత్వం గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా అంటూ అంతటా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే అంతా ఊహించినట్లుగానే బలనిరూపణ పరీక్షలో బీజేపీ విజయం సాధించింది. కుమార స్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.  

కర్ణాటక అసెంబ్లీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి రంగంలోకి దిగారు. యడ్యూరప్ప ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ కు ఆదేశాలు జారీ చేశారు. 

అయితే ఎమ్మెల్యే ఎన్.మహేశ్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు గైర్హాజరు కావడంతో మాయావతి సీరియస్ అయ్యారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినందుకు అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

click me!