రెబెల్ ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం: చావుదెబ్బ తీసేందుకు కాంగ్రెస్-జేడీఎస్ ప్లాన్

By Nagaraju penumalaFirst Published Jul 23, 2019, 9:30 PM IST
Highlights

ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన వారు పరోక్షంగా బీజేపీ పక్షాన నిలబడే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెబెల్స్ లో కొందరికి మంత్రి పదవులు దక్కే అవకాశంతోపాటు కొందరు మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి రాకుండా వారిపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

బెంగళూరు: రెబెల్ ఎమ్మెల్యేల దెబ్బతో అధికారంలో కోల్పోయిన కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు వారిపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కూలడానికి కారణమైన వారిని ఉపేక్షించకూడదని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన వారు పరోక్షంగా బీజేపీ పక్షాన నిలబడే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెబెల్స్ లో కొందరికి మంత్రి పదవులు దక్కే అవకాశంతోపాటు కొందరు మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి రాకుండా వారిపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదే అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అసెంబ్లీకి గైర్హాజరు కావడం ద్వారా 15-16 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఉల్లంఘించారని ఫలితంగా వారిపై అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు.  

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే వారిలో కొందరు మంత్రి పదవులను కోల్పోతారని తెలుస్తోంది. కొత్త  ప్రభుత్వంలో చేరేందుకు అవకాశం ఉండదని తెలుస్తోంది. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత సైతం కోల్పోతారని సిద్ధరామయ్యా స్పష్టం చేశారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. 

click me!