పంజాబ్ ఎన్నిక‌ల‌కు ముందే మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టుకు మోడీ ప్ర‌భుత్వ ప్లాన్ - కేజ్రీవాల్

By team teluguFirst Published Jan 23, 2022, 3:03 PM IST
Highlights

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం ఢిల్లీ హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద‌ర్ జైన్ ను అరెస్టు చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ విషయంలో తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

punjab assembly election 2022 : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం ఢిల్లీ హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద‌ర్ జైన్ ను అరెస్టు చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శ‌నివారం ఆయ‌న వ‌ర్చువ‌ల్ గా మీడియాతో మాట్లాడారు. అయితే తాము ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, కాబ‌ట్టి ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌బోమ‌ని తేల్చి చెప్పారు. ఢిల్లీ సీఎంతో స‌హా ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌ల‌ను అరెస్ట్ చేసేందుకు మోడీ ప్ర‌భుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా మరేదైనా ఏజెన్సీని పంపవచ్చని కేజ్రీవాల్ అన్నారు. 

“పంజాబ్ ఎన్నికలకు ముందు సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేయాలని ED యోచిస్తోందని మాకు స‌మాచారం అందింది. అయితే మేము వారికి స్వాగ‌తం ప‌లుకుతాం. సత్యేందర్ జైన్‌పై కేంద్ర ప్రభుత్వం గతంలో రెండుసార్లు దాడులు చేసినా అందులో ఏమీ లభించలేదు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు ఉన్నందున్న‌.. ఏ ఎన్నిక‌ల్లో అయినా బీజేపీ ఓడిపోతున్న‌ప్పుడు.. వారు అన్ని ఏజెన్సీలను (ప్రతిపక్షానికి వ్యతిరేకంగా) వ‌దులుతారు ”అని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఎవరైనా సత్య మార్గంలో నడిచినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని, ఆప్ నేతలు భయపడరని ఆయన ఢిల్లీ సీఎం అన్నారు. ‘‘ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఆదాయపు పన్ను ఈడీ తో పాటు ఇతర ఏజన్సీలతో ఇతర ఏజెన్సీలను పంపాలనుకుంటే.. పంప‌వ‌చ్చు. స‌త్యేంద‌ర్ జైన్ తో పాటు స‌హా ఇతర నాయకులను అరెస్టు చేయాలనుకుంటే వారంతా స్వాగతం పలుకుతారు’’ అని కేజ్రీవాల్ చెప్పారు. తనపై,  మనీష్ సిసోడియాపై గతంలో జరిగిన దాడుల్లో ఏమీ బయటకు రాకరాలేద‌ని అన్నారు. జైన్ ను కూడా ఈడీ అరెస్టు చేస్తే వారంలో బెయిల్‌పై బయటకు విడుదల అవుతారని ఢిల్లీ సీెం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

తాము ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌బోమ‌ని అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. తాము పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్చ న్నీలాగా ఏడ‌వ‌మని, విసింగిచ‌బోమ‌ని తెలిపారు. తన బంధువులపై దాడులు చేశారని చ‌న్నీక‌న్నీరుమున్నీరుగా విలపిస్తున్నార‌ని అన్నారు. తప్పుడు పనులు చేశానంటూ బెంబేలెత్తిపోతున్నాడ‌ని అన్నారు. అయితే అత‌డు ప‌ట్టుబ‌డ్డాడ‌ని తెలిపారు. ఈడీ అధికారులు నోట్ల కట్టలు లెక్కిస్తుంటే జనం చూస్తూనే ఉన్నార‌ని చెప్పారు. దీంతో పంజాబ్ ప్రజలు షాక్‌కు గురయ్యార‌ని ఆరోపించారు. 

కొన్ని రోజుల క్రితం పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జీత్ సింగ్ చన్నీ బంధువు భూపీందర్ హనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. ఈ దాడిలో బంగారం, ఆస్తుల పత్రాలతో పాటు కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి పంజాబ్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి అధికారం చేప‌ట్టాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగానే పంజాబ్ పై ఆమ్ ఆద్మీ దృష్టి పెట్టింది. అక్క‌డి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇటీవ‌ల ఎన్నిక‌ల కోసం మేనిఫెస్టో కూడా విడుద‌ల చేసింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల ఫ‌లితాలు లెక్కిస్తారు. 
 

click me!