బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. రోజుకి 4జీబీ డేటా

Published : Jun 14, 2018, 12:29 PM IST
బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. రోజుకి 4జీబీ డేటా

సారాంశం

కేవలం రూ.149కే

ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియో, ఐడియా, వొడాఫోన్లతో పోటీపడేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వినియోగదారులను ఆకట్టుకునేందుకు  విభిన్న ఆఫర్లను తీసుకువస్తోంది. 

తాజాగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఓ ఆఫర్ వినియోగదారులకు తెగ నచ్చేస్తోంది. కేవలం రూ.149కే రోజుకి 4జీబీ డేటా ఇవ్వనున్నట్ల కంపెనీ ప్రకటించింది. దీని వేలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. 

‘ఫిఫా వరల్డ్‌ కప్‌ స్పెషల్‌ డేటా ఎస్‌టివి 149’ పేరుతో సంస్థ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రోజుకు 4జిబి 3జి డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే ఎస్‌టివి 149తో రీచార్జ్‌ చేసుకుంటే ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు వర్తించవు. అన్ని బిఎ్‌సఎన్‌ఎల్‌ సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం