
అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని Amritsarసమీపంలో గల Khasa గ్రామం వద్ద BSF క్యాంపులో ఆదివారం నాడు తోటి Jawansపై సహచర జవాన్ కాల్పులకు దిగాడు.ఈ ఘటనలో Firingలోఐదుగురు మరణించారు. అనంతరం కాల్పులు జరిపిన కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. అమృత్‌సర్ లోని 144 బీఎస్ఎఫ్ బెటాలియన్ లో ఈ ఘటన జరిగిందని బీఎస్ఎఫ్ అధికారికంగా ప్రకటివంచింది. సత్తెప్ప అనే బీఎస్ఎఫ్ జవాన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సత్తెప్ప సహా ఐదుగురు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని బీఎస్ఎఫ్ ప్రకటించింది. గాయపడిన వారిని గురునానక్ ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు. తోటి జవాన్లపై కాల్పులు జరిపిన తర్వాత సత్తెప్ప కూడా ఆత్మహత్య చేసుకొన్నాడని అధికారులు వివరించారు. ఈ ఘటనకు గల కారణాలపై బీఎస్ఎఫ్ విచారణకు ఆదేశించింది.