
గుజరాత్ (gujarath)లోని కచ్ (Kutch) జిల్లా హరామి నల్లా (harami nalla) ప్రాంతంలో పాక్ చేపల పడవలు చొరబడినట్లు గుర్తించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ఇప్పటివరకు మొత్తం ఆరుగురు పాక్ (Pak) మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. ఆ ప్రాతంంలో ఇంకా పాకిస్తాన్ జాతీయులు ఉన్నారా అనే అనుమానంతో ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఈ మేరకు బీఎస్ఎఫ్ ప్రకటన విడుదల చేసింది.
“గుజరాత్‌లోని హరామి నల్లాలో నిన్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్లు (fishing boats), మత్స్యకారుల చొరబాటు జరిగిందని కనుగొన్నాం. గుజరాత్ ఫ్రాంటియర్ (gujarat frontier) BSF వెంటనే 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో భారీ శోధన ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఫలితంగా ఇప్పటి వరకు 11 పాకిస్థానీ ఫిషింగ్ బోట్లను సీజ్ చేశాం’’ అని బీఎస్ఎఫ్ తెలిపింది.
బీఎస్ఎఫ్ (BSF) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 9వ భారత జలాల్లో బోట్లను గుర్తించిన అనంతరం వెంటనే ఆపరేషన్ ప్రారంభించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో 11 బోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian air force) హెలికాప్టర్లు (helicaptor) ఆ ప్రాంతంలో మూడు కమాండో (commando)లను గాలిలోకి దింపాయి. ఇంకా ఎవరైనా పాకిస్తాన్ మత్య్సకారులు ఉన్నారేమో అనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే విపరీతమైన చిత్తడి ప్రాంతం కావడంతో పాటు మడ అడవులు, అలల కారణంగా ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని వర్గాలు తెలిపాయి.
‘‘ సాధారణ పెట్రోలింగ్ లో భాగంగా BSF సిబ్బంది ఆ ప్రాంతాన్ని కెమెరా-మౌంటెడ్ UAVని ఆకాశంలోకి పంపారు. అయితే ఆ పరికరం సాయంతో తాము హరామి నాలాలో తొమ్మిది ఫిషింగ్ బోట్లను ఉన్నట్టు గుర్తించాం. వెంటనే BSF పెట్రోలింగ్ బోట్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడున్న పాకిస్తాన్ బోట్లను, మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాం’’ అని బీఎస్‌ఎఫ్ గుజరాత్ ఫ్రాంటియర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ జీఎస్ మాలిక్ (gujarat frontier inspector general gs malik) ఓ మీడియా సంస్థతో తెలిపారు. కచ్ (Kutch)లోని క్రీక్ (kreek)ఏరియాలోకి భారతీయ మత్స్యకారులను అనుమతించడం లేదని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 1వ తేదీన గుజరాత్ (gujarath) రాష్ట్రం కచ్ (Kutch) జిల్లాలోని క్రీక్ (kreek) ప్రాంతంలో అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని, మూడు ఫిషింగ్ బోట్‌లను బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకుంది. సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో నలుగురైదుగురు మత్స్యకారులు ఉన్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ల యాక్టివిటీని BSF గమనించింది. అయితే బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ బోట్లను చూసి పాక్ చొరబాటుదారులు పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ వారిని భద్రతా బలగాలు వెంబడించాయి. ఓ పాకిస్థానీ జాలరిని పట్టుకుంది. అతడికి సంబంధించిన మూడు పడవలను స్వాధీనం చేసుకుంది. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. ఆ ప్రాంతం అంతా బురదమయంగా ఉండటంతో వారిని పట్టుకోవడం బీఎస్ఎఫ్ కు కొంచెం కష్టంగా మారింది. అయితే స్వాధీనం చేసుకున్న మూడు బోట్లను సోదాలు చేయగా అందులో అనుమానస్పదంగా ఏమీ కనిపించలేదు.