'మళ్లీ అసెంబ్లీకి రాలేను, మాట్లాడలేను..' :వీడ్కోలు ప్రసంగంలో బీఎస్‌ యడ్యూరప్ప భావోద్వేగం

Published : Feb 23, 2023, 05:20 AM IST
'మళ్లీ అసెంబ్లీకి రాలేను, మాట్లాడలేను..' :వీడ్కోలు ప్రసంగంలో బీఎస్‌ యడ్యూరప్ప భావోద్వేగం

సారాంశం

కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప బుధవారం అసెంబ్లీలో వీడ్కోలు ప్రసంగం చేశారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడ్యూరప్ప ఇప్పటికే ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంట్లో కూర్చునే ప్రశ్నే లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు.

కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప బుధవారం అసెంబ్లీలో వీడ్కోలు ప్రసంగంలో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు, తన చివరి శ్వాస వరకు అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడ్యూరప్ప ఇప్పటికే ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంట్లో కూర్చునే ప్రశ్నే లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు.

యడ్యూరప్ప మాట్లాడుతూ - బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. సభలో బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న యడ్యూరప్ప.. అధికార పార్టీ శాసనసభ్యులు విశ్వాసంతో ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడగాలని కోరారు. స్పష్టమైన మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

దేవుడు నాకు బలం ఇస్తే.. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ ఇచ్చిన గౌరవాన్ని జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు తాను ఒకటే చెప్పదలచుకున్నాననీ, పట్టుదలగా ఎన్నికలకు సిద్ధం కండి. విపక్షాలు కూడా మనతో కలిసి వస్తాయని అన్నారు. మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే, వారిని కూడా కలుపుకొని బీజేపీని తిరిగి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువద్దామని  అన్నారు.  

ఒక విధంగా ఇది నా వీడ్కోలు.. ఎందుకంటే దీని తర్వాత నేను అసెంబ్లీకి రాలేను లేదా మాట్లాడలేను. ఈ సమయంలో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జెసి మధుస్వామి జోక్యం చేసుకుని శుక్రవారం సభలో యడ్యూరప్ప చివరి ప్రసంగం చేస్తారని చెప్పారు. ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మరోసారి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తర్వాత ఆ రాష్ట్ర నేతలు కూడా ఉత్సాహంగా ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?