జూన్ 23న పాట్నాలో విపక్షాల సమావేశం.. దూరంగా ఉండనున్న బీఆర్ఎస్..!!

Published : Jun 19, 2023, 09:32 AM IST
జూన్ 23న పాట్నాలో విపక్షాల సమావేశం.. దూరంగా ఉండనున్న బీఆర్ఎస్..!!

సారాంశం

కేంద్రంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత కోసం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్: కేంద్రంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత కోసం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన పలువురు విపక్ష నేతలతో సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యతను చాటేలా జూన్ 23న పాట్నాలో సమావేశం ఏర్పాటు చేసేందుకు నితీష్ కుమార్ రెడీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో పాటు పలు విపక్ష పార్టీలు పాల్గొననున్నాయి. అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ దూరంగా ఉండనుందని ఆ పార్టీ తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉండాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టుగా  పేర్కొన్నాయి. అందుకే కాంగ్రెస్ భాగమైన ఈ గ్రూప్‌కు దూరంగా ఉండాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలిపాయి. 

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో పార్టీ విస్తరణ, కార్యాలయాలు, మరియు సభ్యత్వ డ్రైవ్‌లు నిర్వహించడంపై బీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టి సారించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దశలో ప్రతిపక్ష కూటమితో చేతులు కలపడం పార్టీ ప్రణాళికలను దెబ్బతీస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్ అని ఏన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్గాలు గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ అపూర్వమైన రీతిలో విస్తరిస్తుందనే ఆందోళనలో ఏన్సీపీ, కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలో పార్టీ విస్తరణ సాగుతున్నందున్న.. ఏన్సీపీ, కాంగ్రెస్, శివసేన (యూబీటీ) పార్టీలు పాల్గొంటున్న ప్రతిపక్ష కూటమిలో పాల్గొంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే, జూన్ 15న నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి రావడానికి పార్టీ ఏ ఫ్రంట్‌లోనూ చేరాలని భావించడం లేదని అన్నారు. 

ఇక, గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించిన కేసీఆర్.. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మినహా పలు విపక్ష పార్టీలతో కూడా చర్చలు జరిపారు. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యాకలాపాలను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు విపక్షల ఐక్యత కోసం ప్రయత్నాలు జరుపుతున్న నితీష్ కుమార్ కూడా.. కేసీఆర్‌తో ప్రత్యేకంగా ఎలాంటి భేటీ నిర్వహించలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్