ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో మరోసారి కవిత పేరు.. అరుణ్ పిళ్లైదీ కీలక పాత్ర : ఈడీ

By Siva KodatiFirst Published May 30, 2023, 3:33 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును మరోసారి ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కవిత పేరు ప్రస్తావించింది ఈడీ. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును మరోసారి ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. లిక్కర్ పాలసీ ద్వారా స్కాం జరిగిందని.. అరుణ్ పిళ్లై సౌత్ గ్రూప్‌లో కీలక వ్యక్తని ఈడీ తెలిపింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ ప్రస్తావించింది. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో ఆస్తులు కొన్నారని ఈడీ పేర్కొంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కవితతో సమావేశాలు జరిగాయని..  ఫినిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్ , బుచ్చిబాబులు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని పేర్కొంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోటీసులు ఇచ్చి విచారణ జరిపామని ఈడీ చెప్పింది.

మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కవిత పేరు ప్రస్తావించింది ఈడీ.  ఈ క్రమంలో తమ వాదన వినిపించేందుకు సమయం కావాలని పిళ్లై తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ నాగ్ పాల్ .. రోటీన్ ఆర్గ్యూమెంట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం తదుపరి విచారణ జూన్ 2కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 
 

click me!