ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ విచారణకు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు

By narsimha lodeFirst Published Mar 24, 2023, 1:21 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆడిటర్ బుచ్చిబాబును  ఈడీ అధికారులు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  మాజీ  ఆడిటర్ బుచ్చిబాబును శుక్రవారంనాడు ఈడీ ప్రశ్నిస్తుంది.  బుచ్చిబాబును ఈడీ అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన  సీబీఐ అధికారులు  అరెస్ట్  చేశారు.  ఢిల్లీ లిక్కర్ పాలసీలో  బుచ్చిబాబు కీలకంగా  వ్యవహరించారని   సీబీఐ  ఆరోపించింది.  ఈ కేసులో  పలు దఫాలు  బుచ్చిబాబును సీబీఐ  అధికారులు  ప్రశ్నించారు.  బుచ్చిబాబుకు  చెందిన  గోరంట్ల అసోసియేట్స్  సంస్థలో  ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల  సమయంలో  కీలక  సమాచారం  సేకరించారని  సమాచారం.ఈ సమాచారం ఆధారంగా  దర్యాప్తు  సంస్థలు విచారణ సాగించాయి.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆడిటర్ బుచ్చిబాబును   విచారించేందుకు  ఈడీకి  కోర్టు  ఈ ఏడాది ఫిబ్రవరి  22న  అనుమతిని  ఇచ్చింది.  దీంతో  ఈడీ అధికారులు  బుచ్చిబాబును విడతల వారీగా  విచారిస్తున్నారు.  ఈ నెల  15వ తేదీన కూడా బుచ్చిబాబును  ఈడీ అధికారులు విచారించారు.  ఇవాళ కూడా  బుచ్చిబాబు ఈడీ విచారణకు  హాజరయ్యారు.  ఈ నెల  16న కవిత  ఈడీ విచారణకు  హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ నెల  16న ఈడీ విచారణకు  కవిత విచారణకు  హాజరు కాలేదు.

also read:ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని  దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ కేసులో  భాగంగా  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన  పలువురిని  దర్యాప్తు సంస్థలు  అరెస్ట్  చేశాయి. ఈ నెల  6వ తేదీన  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు.   అరుణ్ రామచంద్ర పిళ్లై  వాంగ్మూలం ఆధారంగా   బీఆర్ఎస్  ఎమ్మెల్సీ  కవితను  ఈడీ అధికారులు విచారణకు  రావాలని  నోటీసులు ఇచ్చారు. 

click me!