కోడలి కొంగు పట్టుకుని సహకరించిన అత్త.. నెట్టింట వైరల్ గా వీడియో.. ఇంతకీ అందులో ఏముందంటే..

Published : Mar 24, 2023, 01:07 PM ISTUpdated : Mar 24, 2023, 01:29 PM IST
కోడలి కొంగు పట్టుకుని సహకరించిన అత్త.. నెట్టింట వైరల్ గా వీడియో.. ఇంతకీ అందులో ఏముందంటే..

సారాంశం

నటుడు భూషణ్ ప్రధాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్ల మనసు దోచుకుంటోంది.

బీచ్‌లో తన భర్తతో రొమాంటిక్ ఫోటో తీసుకోవడానికి ఓ కోడలు ప్రయత్నిస్తుంది. ఆమె ప్రయత్నానికి ఆ అత్తామామలు కోడలుకు సహాయం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అత్తాకోడళ్ల మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించిన ఈ వీడియోను నటుడు భూషణ్ ప్రధాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఓ యువ జంట బీచ్‌లో రాళ్లపై నిలబడి ఫోటోలకు పోజులివ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో ఫోటోలు క్లిక్ చేస్తున్న ఒక పెద్దాయన కూడా ఉన్నారు. ఓ పెద్దావిడ కోడలు దుపట్టాను కిందినుంచి పట్టుకుని ఆమె పోజులివ్వడానికి సహాయం చేస్తుంది. అనేక ప్రయత్నాల తర్వాత, జంట తాము అనుకున్న సరైన భంగిమలో ఫొటో దిగగలిగారు.

వీడియో క్యాప్షన్ ఇలా ఉంది, "ఈ అత్తమామలు తమ కోడలు బీచ్‌లో ఒక చక్కటి చిత్రాన్ని దిగడానికి సహాయం చేయడం చూసి ఆశ్యర్యపోయాను!" అని రాసుకొచ్చారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ మంది చూశారు. అనేక మంది కామెంట్లలో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. "అందరు అమ్మాయిలు క్లౌడ్ 9గా దీనిని చూస్తున్నారు... మంచి ఫొటోనో, రీలో చేయాలనుకునే ప్రతీ వ్యక్తి చుట్టూ ఇలా సహాయం చేసే మంచి వ్యక్తులు ఉండాలని కోరుకుంటారు..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

మరొకరు వ్యాఖ్యానిస్తూ.. "అత్తామామల నుంచి అటువంటి ప్రవర్తనను చూడటం చాలా అరుదు" అనగా.. మూడవ వినియోగదారు ఇలా వ్రాశాడు, "నా అత్తమామలు కూడా అలాగే చేస్తారు. వారిది చాలా ప్రేమగళ్ల మనస్తత్వం..’ అని చెప్పుకొచ్చారు. ఇదొక ప్రేమ పూర్వక వీడియో అని ఒకరు కామెంట్ చేయగా.. ఇంతకీ ఆ ఫొటో ఎలా వచ్చిందో నాకు చూడాలని ఉంది అంటూ మరో వినియోగదారుడు ఆసక్తి కనబరిచాడు. 

 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu