సోదరి కులాంతర వివాహం చేసుకుందని ఓ అన్న ఆమెను కిడ్నాప్ చేశాడు. అత్తగారింటికి వెళ్లి మరీ బలవంతంగా బండిమీద ఎక్కించుకుని ఎత్తుకొచ్చాడు.
బీహార్ : ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. దానికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం..కులాంతర, మతాంతరా, ఖండాంతర వివాహాలు జరగడం నేటి రోజుల్లో చాలానే కనిపిస్తున్నాయి. మరోవైపు.. తమకు ఇష్టం లేని వివాహం చేసుకున్నారన్న కారణంతో.. తమ కులం కాని వారిని చేసుకున్నారన్న కోపంతో పరువు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అయితే.. బీహార్ లోని ఆరారియా జిల్లాలో ఇలాంటిదే విచిత్రమైన ఘటన ఒకటి జరిగింది.
చెల్లెలు తమ కుటుంబానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకుంది. ఇది ఇష్టం లేని అన్న బైక్ మీద వచ్చి.. అత్తవారింటినుంచి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన బీహార్ లోని అరారియా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరారియాజిల్లాకు చెందిన రూప, ఛోటు కుమార్ ఠాకూర్ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరిద్దరూ వేరువేరు కులాలకు చెందినవారు.
తప్పుడు ప్రచారం.. ఐదేండ్ల క్రితం వీడియో.. తాజాగా నెట్టింట్లో వైరల్..
ఈ కారణంతోనే వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిపినప్పుడు యువతి తరపు వారు పెళ్ళికి అంగీకరించలేదు. అయినా కూడా తామిద్దరూ ఒకటి కావాలనుకున్న ప్రేమికులు.. కుటుంబ సభ్యులను కాదని జూన్ రెండవ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసి యువతి సోదరుడు తీవ్ర అగ్రహానికి వచ్చాడు. పెళ్లయిన తెల్లారే.. మరో వ్యక్తితో కలిసి యువతి అత్తవారింటికి వచ్చాడు.
అక్కడున్న తన సోదరుని బలవంతంగా బైక్ మీద ఎక్కించుకొని ఎత్తుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు..వెంటనే సెల్ ఫోన్లో వీడియో లు కూడా తీశారు. అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు అందుకున్న బథ్ నాహ పోలీసులు యువతిని.. తల్లి వారి ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. రూప వాంగ్మూలం తీసుకున్న తర్వాత.. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.