మ‌హారాష్ట్రలో కూలిన బ్రిడ్జ్.. ఒక‌రు మృతి.. 20 మందికి గాయాలు

Published : Nov 27, 2022, 11:42 PM ISTUpdated : Nov 27, 2022, 11:43 PM IST
మ‌హారాష్ట్రలో కూలిన బ్రిడ్జ్.. ఒక‌రు మృతి.. 20 మందికి గాయాలు

సారాంశం

Pune: మహారాష్ట్రలో వంతెన కూలిన ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ₹ 1 లక్ష, స్వల్ప గాయాలైన వారికి ₹ 50,000 ఎక్స్‌గ్రేషియాను రైల్వే ప్రకటించింది.  

Maharashtra bridge collapse: మహారాష్ట్రలో ఒక బ్రిడ్జ్ కూలిన ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయ‌ప‌డ‌గా, వారిలో ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ₹ 1 లక్ష, స్వల్ప గాయాలైన వారికి ₹ 50,000 ఎక్స్‌గ్రేషియాను రైల్వే ప్రకటించింది.

వివ‌రాల్లోకెళ్తే.. మ‌హారాష్ట్రలోని చంద్రపూర్‌లోని బల్లార్షా రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు వంతెనపై నుంచి దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి ట్రాక్‌పై పడిపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్ప‌టికే ఒక‌రు ఈ ప్ర‌మాదం కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. బాధిత ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుండి ప్లాట్‌ఫారమ్ నంబర్ 4కి వెళుతుండగా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మాట్లాడుతూ.. "బల్లార్షా రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిన ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, సాధారణ గాయాలు తగిలిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియాను రైల్వే ప్రకటించింది. గాయపడిన వ్యక్తులను త్వరగా కోలుకోవడానికి ఇతర ఆసుపత్రులకు తరలించి మెరుగైన‌ వైద్యం అందిస్తున్నారు" అని తెలిపారు. 

ఆదివారం సాయంత్రం 5:10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాగ్‌పూర్ నుండి దాదాపు 150కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న చంద్రపూర్‌లోని స్టేషన్‌లోని ఓవర్‌బ్రిడ్జ్ ప్లాట్‌ఫారమ్ 1-2ని అనుసంధానించింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించి వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నేలపై ఖాళీ గ్యాప్ కనిపించింది. అలాగే, ప్రజలు భయంతో పరుగులు తీయడం కనిపించింది.

 

 

 

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
USA: అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే టాప్ 5 నగరాలు ఇవే.. ఈ ప్రాంతాలే ఎందుకు? వాటి ప్రత్యేకత ఏంటి?