వారి ఓటు హక్కు ఎత్తేయాలి.. జనాభా నియంత్రణ గురించి కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Nov 27, 2022, 7:53 PM IST
Highlights

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ పాలసీని మతాలకు అతీతంగా అమలు చేయాలని అన్నారు. ఈ పాలసీని పాటించని వారి ఓటు హక్కు ఎత్తేయాలని తెలిపారు.
 

న్యూఢిల్లీ: సీనియర్ బీజేపీ లీడర్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ బిల్లును ఉల్లంఘించిన వారి ఓటు హక్కు ఎత్తేయాలని అన్నారు. జనాభా నియంత్రణను మతాలకు అతీతంగా అందరికీ వర్తింపజేయాలని వివరించారు. జనాభా నియంత్రణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది.

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, భారత దేశానికి జనాభా నియంత్రణ బిల్లు చాలా అవసరం అని నొక్కి చెప్పారు. మన దేశంలో వనరులు పరిమితంగా ఉన్నాయని వివరించారు. చైనా వన్ చైల్డ్ పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టి జనాభా నియంత్రణను అమలు చేసిందని తెలిపారు. అందుకే వారు అభివృద్ధిని సాధించారని పేర్కొన్నారు. చైనాలో నిమిషానికి పది మంది పిల్లలు జన్మిస్తున్నారని వివరించారు. అదే ఇండియాలో 30 మంది పిల్లలు జన్మిస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు చైనాతో భారత్ ఎలా పోటీ పడుతుందని వివరించారు.

Also Read: జనాభా నియంత్రణ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

అంతేకాదు, జనాభా నియంత్రణను మతానికి, తెగలకు అతీతంగా అమలు చేయాలని బీజేపీ నేత తెలిపారు. ఈ పాలసీని అమలు చేయని వారికి ప్రభుత్వ బెనిఫిట్లు అందించరాదని వివరించారు. అంతేకాదు, వారు ఓటేసే హక్కును కూడా ఎత్తేయాలని అభిప్రాయపడ్డారు.

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ నిన్న మాట్లాడుతూ, మహిళలపై ఎలాంటి హింసను అయినా మతం కోణంలో చూడరాదని, ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా కచ్చితంగా మహిళలపై హింసను ఖండించాలని వివరించారు. ఎన్సీఆర్బీ డేటాను ఉటంకిస్తూ దేశంలో చాలా సీరియస్ సిచుయేషన్ ఉన్నదని పేర్కొన్నారు.

click me!