మరదలి పెళ్లి.. కోరిక తీరలేదని పందిట్లో బావ రచ్చ.. చేసేదేం లేక...

By AN TeluguFirst Published May 24, 2021, 1:21 PM IST
Highlights

లక్నోలో ఓ పెళ్లి పూర్తి పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. వారేమైనా సెలబ్రిటీలా? అంటే కానేకాదు.. మామూలు జంటే... అయితే పోలీసు బందోబస్తు ఎందుకు అంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

లక్నోలో ఓ పెళ్లి పూర్తి పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. వారేమైనా సెలబ్రిటీలా? అంటే కానేకాదు.. మామూలు జంటే... అయితే పోలీసు బందోబస్తు ఎందుకు అంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

సాధారణంగా ఏ వధూవరులైనా తమ వివాహ వేడుక కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగవైభవంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకల్లో పరిమిత సంఖ్యలో బంధువులు పాల్గొనాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు విధించిన సంగతి కూడా తెలిసిందే. 

అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో వివాహ వేడుకకు పోలీస్ స్టేషన్ వేదికైంది.  వివరాల్లోకి వెళితే మరి కొద్ది నిమిషాలలో వధూవరులు వివాహం చేసుకుని ఒక్కటి కాబోతున్న వేళ పందింట్లో పెద్ద గొడవ జరిగింది. వధువు క్రాంతి వర్మ కు సంబంధించిన కొంత మంది బంధువులు... వరుడు కమలేశ్వర్ వర్మ, బంధువులు, అతిథులపై దాడికి దిగారు.

అంతటితో ఆగకుండా వధువు బావ వరుసయ్యే ఓ వ్యక్తి కమలేశ్‌ తండ్రి రామకృష్ణను కిందకి తోసేసి దాడి చేశాడు. కమలేశ్‌ సోదరుడు, బంధువులు ఎంత ఆపినా వారు వినకుండా, మధ్యలో వచ్చిన వారిని తోసేస్తూ, నానా హంగామా చేశారు. దీంతో ఏం చేయలేక వధూవరుల కుటుంబ సభ్యులు అక్కడి నుంచి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. 

దీంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తూ పోలీస్ స్టేషన్ లోనే సంప్రదాయబద్దంగా కమలేశ్ వర్మ, క్రాంతి వర్మ వివాహం జరిపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. వధువు బంధువులు వివాహ వేడుకలో గొడవ చేశారని తెలిపారు.

దీంతో తమ సమక్షంలో పోలీస్స్టేషన్లో వివాహం చేశామని వివరించారు. రాత్రి 2:30 గంటలకు వివాహ పూర్తయిందని, పోలీసుల భద్రత కల్పిస్తూ.. ఉదయం 6:30 గంటలకు వారిని ఇంటికి పంపించినట్లు తెలిపారు. గొడవకు పాల్పడిన వధువు బంధువులు, బావపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వరుడు కమలేశ్ సోదరుడు మాట్లాడుతూ.. వివాహ వేడుకలో గొడవ జరుగుతుందని అసలు ఊహించలేదన్నారు. పెళ్లి కూతురు క్రాంతి వర్మ తండ్రి చాలా మంచివారని, మద్యం కూడా సేవించారని అన్నాడు. అయితే క్రాంతికి బావ వరసయ్యే వ్యక్తి.. క్రాంతిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడని జరగకపోవడంతో ఇలా దాడికి తెగబడ్డాడని తెలిపాడు. అయితే పోలీసుల సాయంతో తమ్ముడు వివాహం జరిగిందని అన్నాడు. 

click me!