వరుడి కారు కోరిక: వధువు ధైర్యం, తాళ్లతో కట్టేసి.. ఖర్చులన్నీ వసూలు చేసి...

By telugu teamFirst Published Dec 14, 2019, 5:21 PM IST
Highlights

పెళ్లి సందర్భంగా ఒక పెళ్ళికొడుకు కోరిన ఒక గొంతెమ్మ కోరికతో ఒక్కసారిగా పెళ్ళికూతురికి చిర్రెత్తుకొచ్చి అతడిని, అతడి కుటుంబ సభ్యులను పెళ్లిపందిట్లోనే తాళ్లతో నిర్బంధించి తగిన విధంగా బుద్ధి చెప్పింది.  ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌‌నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పెళ్లి సందర్భంగా ఒక పెళ్ళికొడుకు కోరిన ఒక గొంతెమ్మ కోరికతో ఒక్కసారిగా పెళ్ళికూతురికి చిర్రెత్తుకొచ్చి అతడిని, అతడి కుటుంబ సభ్యులను పెళ్లిపందిట్లోనే తాళ్లతో నిర్బంధించి తగిన విధంగా బుద్ధి చెప్పింది.  ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌‌నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే... ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, ఢిల్లీకి చెందిన వివేక్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. వధువు సొంత ఊరిలో పెళ్లికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, తాళి కట్టడానికి కొద్ది నిమిషాల ముందు ఉన్నపళంగా తనకు కట్నంగా కారు కావాలని పెళ్లికొడుకు డిమాండ్ చేసాడు. 

పెళ్లికి ముందు ఇలాంటివేం మాట్లాడుకోలేదని, ఇప్పుడు చివరి నిమిషంలో ఈ గొంతెమ్మ కోరికలు ఏంటని పెళ్లికూతురు తరఫువారు ప్రశ్నించారు. ఇలాంటి కోరికలు వద్దని, తమకంఠా స్థోమత లేదని పెళ్లికూతురు తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పెళ్ళికొడుకు ససేమిరా ఒప్పుకోలేదు. 

ఈ క్రమంలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు మధ్య ఈ విషయమై గొడవ కూడా జరిగింది. దీంతో వధువుకు చిరాకు వేసి, పెళ్ళికొడుకు ప్రవర్తన తనకు నచ్చలేదని... అతన్ని పెళ్ళిచేసుకుని ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. 

ఇక గొడవ పెద్దగా అవటంతో గ్రామస్తులంతా కూడా రంగంలోకి దిగారు. తమ గ్రామ ఆడపడుచుకి ఎలా అన్యాయం చేస్తారంటూ పెళ్ళికొడుకు బంధువుల్ని ప్రశ్నించారు.  గొడవ పెద్దగవడంతో  పెళ్ళికొడుకు వివేక్‌ను పందిట్లోనే కట్టేశారు. వరుడి తల్లిదండ్రులను కూడా నిర్బంధించారు. 

ఇక వీరికి తగిన శాస్తి చేయాలని అనంతరం వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వైపులా పెద్దమనుషులు జోక్యం చేసుకొని ఈ గొడవకు పరిష్కారం చూపేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి ఇరు వర్గాలు. వధువు తరఫు వారు పెళ్ళికి పెట్టిన ఖర్చులన్నీ తిరిగి చెల్లించడంతో పెళ్లికొడుకుని, అతడి తల్లిదండ్రులని వదిలిపెట్టారు.

click me!