నిర్భయ దోషుల ఉరి ప్రత్యక్ష ప్రసారాన్ని కోరుతూ సుప్రీంలో పిల్

By telugu teamFirst Published Dec 14, 2019, 4:05 PM IST
Highlights

నిర్భయ హంతకులకు నెల రోజుల్లోపు మరణ శిక్ష విధించాలని, వారి ఉరి శిక్షను కనీసం నిర్భయ కుటుంబీకులకైనా ప్రత్యక్ష ప్రసారం జరపాలని సుప్రీమ్ కోర్టులో ఒక పిల్ దాఖలయింది. అమెరికాలో మాదిరి ఇలా గనుక చేస్తే నిర్భయ కుటుంబీకులకు కనీసం తమ కూతురి ఆత్మకు శాంతి చేకూరిందనే సంతృప్తి అయినా మిగులుతుందని ఆ సదరు  పిటిషనర్   ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. 

న్యూ ఢిల్లీ: అత్యంత పాశవికంగా నిర్భయను అత్యాచారం చేసి చంపినా కేసులో ఇప్పటికే కోర్టు అందరికి మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురి రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీమ్ తోసి పిచ్చగా ఇంకొక్క వ్యక్తి పిటిషన్ పై కోర్టు 17వ తేదీనాడు నిర్ణయం తీసుకోనుంది. 

ఈ నేపథ్యంలో సుప్రీమ్ కోర్టులో ఒక పిల్ దాఖలయింది. నిర్భయ హంతకులకు నెల రోజుల్లోపు మరణ శిక్ష విధించాలని, వారి ఉరి శిక్షను కనీసం నిర్భయ కుటుంబీకులకైనా ప్రత్యక్ష ప్రసారం జరపాలని ఆ సదరు పిటిషనర్ కోర్టును కోరారు. అమెరికాలో మాదిరి ఇలా గనుక చేస్తే నిర్భయ కుటుంబీకులకు కనీసం తమ కూతురి ఆత్మకు శాంతి చేకూరిందనే సంతృప్తి అయినా మిగులుతుందని ఆ సదరు  పిటిషనర్   ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. 

అంతే కాకుండా ఉరితాడు కోసం ఖర్చు చేసిన డబ్బులను దోషుల కుటుంబ సభ్యులనుండి వసూలు చేయాలనీ, ఇలా చేస్తే, తమ కొడుకు చేసిన తప్పుకు తాము విలువలు నేర్పకపోవడమే కారణమనే విషయం తెలిసివస్తుందని ఆ  పిటిషనర్ ఆ పిటిషన్లో కోర్టును వేడుకున్నాడు. 

2012 డిసెంబర్ లో నిర్భయను కదిలో బస్సులో అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నడిరోడ్డుపై  వివస్త్రను చేసి పడేశారు. ఆమె ప్రైవేట్ పార్ట్ లో గాజు ముక్కలను కూడా చొప్పించారు. కాగా... నిర్భయ దాదాపు 13 రోజలపాటు చావుతో పోరాడి ప్రాణాలు వదిలింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా... ఒకరు మైనర్ కావడంతో మూడు సంవత్సరాల శిక్షతో విడుదలయ్యాడు.

మరో దోషి....రాంసింగ్ 2013లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు పవన్ కుమార్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లు మాత్రం ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

ఈ నలుగురు దోషులకు మరో రెండు, మూడు రోజల్లో ఉరిశిక్ష విధించనున్నారు. కాగా... నలుగురు దోషులు  పవన్ కుమార్ గుప్తా, ముకేశ్‌, వినయ్‌ శర్మ,అక్షయ్‌ కుమార్‌సింగ్‌‌లను ప్రత్యేక జైలు గదుల్లో ఉంచి, ఒక్కొక్కరికి ఐదుగురు పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. నిర్భయ కేసు దోషి అయిన రాంసింగ్ 2013లో జైల్లో ఆత్మహత్య చేసుకున్న దృష్ట్యా ఈ నలుగురు దోషులకు తమిళనాడు పోలీసులతో నిరంతర పహరా ఏర్పాటు చేశారు.
 
శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నలుగురు దోషులు కోర్టు విచారణకు హాజరయ్యారు. నిర్భయ కేసు దోషులు నలుగురు జైల్లో సరిగా తినడం లేదని తీహార్ జైలు అధికారులు చెప్పారు. దోషులు నలుగురు గతంలో సుష్టుగా భోజనం చేసేవారని...కానీ ఉరి తీసే తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో వారు తీసుకునే ఆహారం తగ్గించారని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి.

click me!