వరుడి నడక తేడాగా ఉంది.. పెళ్లి ఆపేసిన వధువు

First Published Jul 25, 2018, 2:37 PM IST
Highlights

పెద్ద కుమారుడ్ని వివాహం చేసుకోకపోయినా.. కనీసం అతడి తమ్ముడ్ని పెళ్లి చేసుకోవాలని యోగేష్‌ కుటుంబ సభ్యులు ఓ ప్రతిపాదనని తీసుకురాగా.. దానినీ వధువు తిరస్కరించింది. 

అబ్బాయి నడక తేడాగా ఉందని మరికాసేపట్లో జరగనున్న వివాహాన్ని వధువు ఆపేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ లో చోటుచేసుకుంది. ఇలా సడన్ గా పెళ్లి ఆపడమేంటని వరుడి కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో వివాదం కాస్త వార్తల్లోకి ఎక్కింది.

 పూర్తి వివరాల్లోకి వెళితే..ఉధారణ్ గ్రామానికి చెందిన యోగేష్‌కి ఇటీవల రూబీతో నిశ్చితార్థం జరిగింది. అయితే.. ఆ సమయంలో యోగేష్‌కి కొద్దిగా అంగ వైకల్యం ఉందనే విషయాన్ని రూబీ కుటుంబ సభ్యులకి వారు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. దీంతో.. గత ఆదివారం వివాహానికి ముహూర్తం ఖరారవగా.. వరుడు వివాహ వేదిక వద్దకు కుంటుతూ నడవడాన్ని వధువు గమనించింది. వెంటనే ఈ విషయమై వరుడి కుటుంబ సభ్యుల్ని నిలదీయగా.. వారు వాస్తవాన్ని దాచినట్లు అంగీకరించారు. దీంతో.. ఆగ్రహించిన వధువు.. తాను ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది. 

పెద్ద కుమారుడ్ని వివాహం చేసుకోకపోయినా.. కనీసం అతడి తమ్ముడ్ని పెళ్లి చేసుకోవాలని యోగేష్‌ కుటుంబ సభ్యులు ఓ ప్రతిపాదనని తీసుకురాగా.. దానినీ వధువు తిరస్కరించింది. దీంతో.. ఇరు కుటుంబాల మధ్య కాసేపు వాదోపవాదనలు జరగ్గా.. పోలీసులు చొరవ తీసుకుని ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో.. నగలు, బహుమతులు పంచుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 

click me!