పెళ్లిలో వరుడికి చెట్టుకు కట్టేసి, చితకబాదిన వధువు తరఫువారు.. ఎందుకో తెలిస్తే...

Published : Jun 16, 2023, 10:35 AM IST
పెళ్లిలో వరుడికి చెట్టుకు కట్టేసి, చితకబాదిన వధువు తరఫువారు.. ఎందుకో తెలిస్తే...

సారాంశం

పెళ్లి పీటల మీద అదనపు కట్నం డిమాండ్ చేశాడో వరుడు. దీంతో చిర్రెత్తిన వధువు కుటుంబీకులు అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు.

ఉత్తరప్రదేశ్ : ఇటీవలి కాలంలో పెళ్లికి సంబంధించిన వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి పీటల మీదికి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు క్యాన్సిల్ అవ్వడం.. గొడవలకు దిగడం ఎక్కువగా జరుగుతున్నాయి.  అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో చోటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి అనగా వరుడికి ఓ దుర్భుద్ధి పుట్టింది. దీంతో అతడు చిక్కుల్లో పడ్డాడు. అతనితో సహా అతని కుటుంబ సభ్యులందరూ బంధీలయ్యారు. పెళ్లికూతురి తరపు కుటుంబ సభ్యులు, బంధువులు వరుడి తరఫు వారందరినీ చెట్టుకు కట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రతాప్ గఢ్ లోని.. మంధాతా కొత్వాలీ ప్రాంతానికి చెందిన  వధువు,  వరుడికి.. కుటుంబ సభ్యులు వివాహాన్ని చేయించారు. ఈ ప్రకారం పెళ్లి వేడుక మొదలయ్యింది. పెళ్లి సమయం దగ్గర పడుతుండడంతో వరుడు..  ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చాడు. బంధుమిత్రులు సన్నిహితులతో వివాహ వేడుక కోలాహలంగా ఉంది. వధువు మెడలో దండ వేసే కార్యక్రమం మొదలవబోతోంది. ఆ సమయంలో వరుడికి ఓ దుర్భుద్ది  పుట్టింది.

జమ్మూకాశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం..

తనకి ఇస్తానన్న కట్నం కాకుండా అదనపు కట్నం కావాలంటూ వరుడు డిమాండ్ చేశాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పెళ్లి పీటల మీద ఇదేం కథ.. అంటూ వరుడికి ఎంతగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా అతను వినలేదు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతనికి మద్దతు పలికారు. దీంతో వధువు కుటుంబ సభ్యులకు చిరాకు పుట్టింది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చారు. వరుడు, అతని కుటుంబ సభ్యులందరినీ చెట్లకు కట్టేశారు.

ఆ తర్వాత వరుడుని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుకుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇంకోవైపు వరుడు మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని వధువు తరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చర్చనీయాంశంగా అయింది. 

PREV
click me!

Recommended Stories

మీకు SBI లో అకౌంట్ ఉందా..? అయితే ఈజీగా రూ.35,00,000 పొందవచ్చు.. ఏం చేయాలో తెలుసా?
Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu