పెళ్లిపందిట్లో వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పెళ్లికి ససేమిరా అంటూ మొండిపట్టు.. కారణం ఏంటటా అంటే..

Published : May 18, 2023, 08:43 AM IST
పెళ్లిపందిట్లో వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పెళ్లికి ససేమిరా అంటూ మొండిపట్టు.. కారణం ఏంటటా అంటే..

సారాంశం

వరుడు నల్లగా ఉన్నాడని వివాహాన్ని రద్దు చేసుకుందో వధువు. తీరా తాళి కట్టే సమయానికి పెళ్లి వద్దంటే వద్దని తిరస్కరించింది. ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది.   

బీహార్ : ఇటీవల కాలంలో పెళ్లి పీటల మీద పెళ్లిళ్లను రద్దు చేసుకుంటున్న వధువుల ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. వరుడు తాగి పెళ్లికి వచ్చాడనో.. పెళ్లి పందిట్లో అదనపు కట్నం డిమాండ్ చేశాడనో... ఇలా కారణమేదైతేనేం.. తనకి ఇష్టం లేని వివాహాన్ని ధైర్యంగా రద్దు చేసుకుంటున్నారు అమ్మాయిలు. అలాంటి కోవలోకి వచ్చే ఓ ఘటనే బీహార్ లో వెలుగు చూసింది. పెళ్లి పందిట్లోకి వచ్చిన వరుడిని చూసి వధువు షాక్ అయింది. అతడిని ససేమిరా పెళ్లి చేసుకోనంటూ పట్టు పట్టింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగా ఒప్పించిన వినలేదు.. చేసేదేం లేక చివరికి పెళ్లిని రద్దు చేసుకున్నారు.

ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్, కహల్ గావ్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వధువు కిట్టూ కుమారి.. వరుడు నల్లగా ఉన్నాడంటూ..  వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని పెళ్లికి నిరాకరించింది. ఇరు వర్గాలు పెళ్లికి  ముహూర్తం పెట్టి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత..పెళ్లి మండపంలోకి వరుడు ఊరేగింపుగా వచ్చాడు. వివాహవేదిక మీదకు నచ్చిన వరుడికి  తిలకం దిద్ది మాల వేసే సమయంలో.. వధువు అతడిని చూసింది. అంతే ఒక్కసారిగా షాక్ అయింది.

వీడిన ప్రతిష్టంభన.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. 20న ప్రమాణ స్వీకారం..

వరుడు తనకంటే వయసులో చాలా పెద్దవాడిలా కనిపించడమే కాకుండా..  నల్లగా ఉండడంతో ఆమెకు నచ్చలేదు. తాను ఈ పెళ్లి చేసుకోనంటూ మొండికేసింది. వధువు కుటుంబ సభ్యులతో సహా..  వరుడి కుటుంబ సభ్యులకు కూడా ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు అనేక రకాల హామీలు ఇచ్చారు. అయినా, వధువు వెనక్కి తగ్గలేదు. తనకు ఈ పెళ్లి వద్దంటే వద్దని కూర్చుంది. దీంతో చేసేదేం లేక వివాహాన్ని రద్దు చేసుకుని వరుడు కుటుంబ సభ్యులు వెనక్కి తిరగాల్సి వచ్చింది. 

ఇదిలా ఉండగా, పెళ్లిలో చిన్న చిన్న విషయాలకు గొడవలు పడడం..  పెట్టుపోతల దగ్గరో.. మర్యాదల దగ్గరో.. భోజనాల దగ్గరో.. వధూవరుల కుటుంబాలకి మనస్పర్ధలు రావడం..అవి  ఘర్షణలకు దారి తీయడం చూస్తూనే ఉంటాం. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ విచిత్రమైన గొడవ వెలుగు చూసింది. దీంతో ఇరువర్గాల్లో  పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో సుబ్రహ్మణ్యం, పూజిత అనే యువతీ యువకుల పెళ్లి జరిగింది. దీనికోసం ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు. వివాహం వారు అనుకున్నట్లుగానే వైభవంగా జరిగింది. ఆ తర్వాత  వివాహ విందు జరుగుతుంది. ఇటీవల కాలంలో వివాహ  వేడుకల్లో వధూవరులు డాన్స్ చేయడం మామూలుగా మారిపోయింది. అలాగే ఈ వధూవరులు కూడా డాన్స్ చేయాలని అక్కడున్న వారంతా వారిద్దరి మీద ఒత్తిడి తెచ్చారు.

అయితే, వధువు తరపు బంధువులు.. ఆడపిల్ల అంతమందిలో.. తన వివాహ వేడుకలోనే డ్యాన్స్ చేయడం ఏమిటంటూ అభ్యంతరం తెలిపారు. దీంతో వధువు కుటుంబ సభ్యులకి.. వరుడు కుటుంబ సభ్యులకు మధ్య వాటా మాటా పెరిగింది. అది వరుడి కుటుంబ సభ్యులు దాడికి దిగడం వరకు వెళ్ళింది.ఈ దాడిలో ఓ మహిళకు తలపగిలింది. మరో వ్యక్తి చేయి విరిగింది. మరో ముగ్గురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు