
ప్రపంచ వ్యాప్తంగా వివాహం విషయంలో చాలా సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు తమ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ పెళ్లిలోనూ వింత ఆచారాలు ఉంటాయి. తాజాగా.. నేపాల్ కి చెందిన ఓ జంట పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలు వధూవరులు ఒకరినొకరు కొట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఈ వీడియో సంగతేంటో ఓసారి చూద్దాం..
ఆ వీడియోలో పెళ్లి జరుగుతోంది. వధూవరులు సంప్రదాయ వస్త్రదారణలో కూర్చొని ఉన్నారు. పంతులు చెప్పిన ప్రకారం చేస్తూ ఉన్నారు. వారి సంప్రదాయం ప్రకారం.. పెళ్లి తంతులో భాగంగా వధూవరులు ఒకరికొకరు స్వీట్ తినిపించుకోవాలి. ఈ క్రమంలో.. ఎవరికి వారు తామే ముందు తినిపించుకోవాలని ఆరాటపడ్డారు.. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకోవడం దాకా వెళ్లడం గమనార్హం.
క్లిప్ చివరిలో, భార్య బలవంతంగా అతనికి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వరుడు నవ్వుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారు కూడా ఈ జంటను పూర్తి స్థాయిలో గొడవ పడకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోకు 70 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ల వర్షం కురుస్తోంది. కొందరు ఈ వీడియోని సరదాగా తీసుకోకోగా.. మరి కొందరు మాత్రం విమర్శించడం గమనార్హం.
ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. ఈ భూమిపై ఏం జరుగుతోందంటూ కామెంట్ చేయడం గమనార్హం. మరొకరేమో.. ‘ వారి ఆచార సంప్రదాయం ప్రకారం.. ఎవరు వేగంగా ఒకరికి ఆహారం తినిపిస్తారని వధూవరులకు పోటీ పెట్టారు.. కానీ.. వీరు దీనిని యుద్దంలా నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లారు.’ అంటూ కామెంట్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. వివాహ ఆచారాల గురించి మాట్లాడుతూ, గత నెలలో ఒక వ్యక్తి , స్త్రీ మరణించిన 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ వేడుక "ప్రేత కళ్యాణం" లేదా "చనిపోయిన వారి వివాహం" అనే సంప్రదాయంలో భాగం. కర్నాటక ,కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఈ సంప్రదాయం పాటిస్తారు, మరణించిన వారి కోసం నిర్వహిస్తారు. అక్కడి కమ్యూనిటీలు తమ ఆత్మలను గౌరవించే మార్గంగా దీనిని విశ్వసిస్తారు.