సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్

By sivanagaprasad kodatiFirst Published Oct 22, 2018, 8:35 AM IST
Highlights

అవినీతిపరులు, అక్రమార్కులు, నేరస్తులకు సింహస్వప్నంగా భావించే సీబీఐకి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అలాంటిది సంస్థ చరిత్రలోనే తొలిసారిగా అవినీతి ఆరోపణలతో సొంత డైరెక్టర్‌పైనే కేసు నమోదు చేసింది

అవినీతిపరులు, అక్రమార్కులు, నేరస్తులకు సింహస్వప్నంగా భావించే సీబీఐకి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అలాంటిది సంస్థ చరిత్రలోనే తొలిసారిగా అవినీతి ఆరోపణలతో సొంత డైరెక్టర్‌పైనే కేసు నమోదు చేసింది.

సీబీఐలో నెంబర్-2గా పరిగణించే స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా.. ఢిల్లీలో మాంసాన్ని మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషీపై నమోదైన మనీలాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన సతీష్ సనా అనే వ్యాపారిని సీబీఐ అధికారులు విచారించారు.

తనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రాకేశ్ ఆస్థానాకు 2017 డిసెంబరు నుంచి పది నెలల్లో వివిధ దఫాల్లో రూ.2 కోట్లు ముడుపులు చెల్లించానంటూ సతీష్ సనా సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో రాకేశ్ ఆస్థానా పేరును చేర్చారు.

ఈ కేసులో ఆస్థానాకు లంచం ఇవ్వాల్సిన సొమ్మును తీసుకునేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన మనోజ్ ప్రసాద్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం మీద దేశంలో అవినీతి, అక్రమాలను వెలికితీసి.. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చరిత్రలోనే ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది.

click me!