#Mee Too ప్రకంపనలు..కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీపై లైంగిక వేధింపుల కేసు

By sivanagaprasad kodatiFirst Published Oct 22, 2018, 7:44 AM IST
Highlights

దేశం మొత్తం ఇప్పుడు #Mee Too ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్ని రంగాలకు చెందిన మహిళలు తాము ఏదో ఒక సమయంలో.. ఎవరో ఒకరి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యామని చెబుతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సెగ కేరళను తాకింది. 

దేశం మొత్తం ఇప్పుడు #Mee Too ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్ని రంగాలకు చెందిన మహిళలు తాము ఏదో ఒక సమయంలో.. ఎవరో ఒకరి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యామని చెబుతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సెగ కేరళను తాకింది.

ఏకంగా మాజీ సీఎం, సీనియర్ నేత ఉమెన్ చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ‘‘2003 కేరళ సౌర ఫలకాల కుంభకోణం’’ కేసులో నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ తనపై 2012లో ముఖ్యమంత్రిగా ఉణ్న చాందీ.. క్యాంప్ కార్యాలయంలో తనపై లైంగిక దాడి జరిపారని.. అలాగే నాటి మంత్రి కేసీ వేణుగోపాల్‌ కూగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాంబు పేల్చారు.

దీనిపై రాష్ట్ర నేర పోలీసు విభాగానికి సరిత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు నిమిత్తం ఎస్పీ అబ్ధుల్ కరీం నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు..

అయితే రాజకీయ కుట్రలో భాగంగానే.. తనపై కేసు పెట్టారని.. దీనిని చట్టపరంగానే ఎదుర్కొంటానని ఉమెన్ చాందీ వ్యాఖ్యానించారు.. మరోవైపు చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కేరళలో సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

click me!