బ్రహ్మోస్ కీలక సమాచారం లీక్: డిఫెన్స్ ఇంజనీర్ నిశాంత్ అరెస్ట్

Published : Oct 09, 2018, 11:40 AM IST
బ్రహ్మోస్ కీలక సమాచారం లీక్: డిఫెన్స్ ఇంజనీర్ నిశాంత్ అరెస్ట్

సారాంశం

గూఢచర్యం  చేసి బ్రహ్మోస్ క్షిపణి సాంకేతిక, రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేశారనే ఆరోపణలతో  రక్షణశాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న  నిశాంత్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  


న్యూఢిల్లీ: గూఢచర్యం  చేసి బ్రహ్మోస్ క్షిపణి సాంకేతిక, రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేశారనే ఆరోపణలతో  రక్షణశాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న  నిశాంత్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  నిశాంత్ అగర్వాల్ మహరాష్ట్రలోని నాగ్‌పూర్ క్షిపణి పరీక్షా కేంద్రం వద్ద సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మిలటరీ ఇంటలిజెన్స్ , ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళాల  ఉమ్మడి ఆపరేషన్  నిర్వహించి నిశాంత్‌ను అరెస్ట్ చేశారు.

నిశాంత్ వ్యక్తిగత,, కార్యాలయ కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. విశాంత్ స్వస్థలమైన రూర్కీలోని ఆయన నివాసంలో నుండి కంప్యూటర్‌ ను రికవరీని చేశారు.  బ్రహ్మోస్ సమాచారాన్ని  ఆయన ఎలా తస్కరించారనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు.  నిశాంత్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై  లక్నోకు తరలిస్తామని అధికారులు ప్రకటించారు.

నిశాంత్ అగర్వాల్ పాక్‌కు  ఈ సమాచారాన్ని చేరవేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అగర్వాల్ పర్సనల్ కంప్యూటర్‌ నుండి  పాక్‌కు చెందిన ఐడీతో చాట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు