13యేళ్ల బాలుడి గొంతుకోసి చంపిన 16యేళ్ల బాలుడు.. చదువుకోవడం ఇష్టం లేక ఘాతుకం...

By Bukka SumabalaFirst Published Aug 23, 2022, 2:12 PM IST
Highlights

చదువునుంచి తప్పించుకోవడానికి ఓ మైనర్ దారుణానికి ఒడిగట్టాడు. తన పదమూడేళ్ల స్నేహితుడి గొంతు కోసి హత్య చేశాడు. 

ఢిల్లీ : పిల్లలు అంటే సంతోషంగా ఉండాలి. ఆడుకోవాలి, చదువుకోవాలి.. చిలిపిపనులు చేయాలి. సమాజంలోని ఏ టెన్షన్ లూ వారి దరిచేరని వయసు అది. అయినా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని అనునిత్యం గమనిస్తుండాలి. వారు ఏం ఆలోచిస్తున్నారు? ఎలా చదువుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు పట్టించుకోవాలి. అలా లేని పక్షంలో నేటి సమాజంలో ఉన్న విపరీత ధోరణులు వారి మీద చెడు ప్రబావం చూపే అవకాశం ఉంది. అలాగే జరిగింది ఓ అబ్బాయి విషయంలో..

ఢిల్లీలోని ఒక 16ఏళ్ల మైనర్ 13 ఏళ్ల తన స్నేహితుడి గొంతుకోసి హతమార్చాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలియజేశారు. వాటి ప్రకారం.. బాధితుడు ఢిల్లీలోని మసూరి నివాసి. ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇతనికి 16యేళ్ల నిందితుడితో స్నేహం ఉంది. ఆ బాధితుడు కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సదరు బాధితుడిని తన మైనర్ స్నేహితుడే స్వయంగా ఇంటికి వచ్చి తీసుకు వెళ్లినట్లు తల్లిదండ్రులు చెప్పారు. 

బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై సుప్రీంకోర్టు విచారణ.. బిల్కిస్ బానో కేసు ఏమిటీ?

దీంతో పోలీసులు ఆ మైనర్ ఇంటికి వెళ్ళి విచారించగా.. అతను ఆ సమయంలో ఇంట్లో లేడు. పైగా అతని తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలేవీ తెలియవు. అయితే, పోలీసులుమైనర్ ని ఓ టీ దుకాణం వద్ద గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. విచారణలో ఆ మైనర్ చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సదరు మైనర్ కి చదువుకోవడం అంటే ఇష్టం లేదట.. కానీ తన తల్లిదండ్రుల పోరు భరించలేక.. చదువుకున్నట్లుగా చెప్పాడు. అంతేకాదు.. ఈ చదువు గోల నుంచి ఎలాగైన తప్పించుకుని... ఏదైనా శరణాలయానికి వెళ్లిపోవాలని గత ఐదేళ్లుగా ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు చూసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పాడు. తన స్నేహితుడిని సరదాగా కారులో వెళ్దాం అని పిలిచి ఒక గాజు ముక్కతో.. గొంతు కోసి హతమార్చినట్లు పేర్కొన్నాడు. అంతేకాక మరొక స్నేహితుడిని కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. పోలీసులు తనను వెతుక్కుంటూ రాకపోతే తానే లొంగి పోదామని అనుకున్నట్లు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. 

click me!