అమితాబ్ ఇంట్లో బాంబు ఉందంటూ ఫోన్..!

By telugu news teamFirst Published Aug 7, 2021, 11:13 AM IST
Highlights

వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అమితాబ్ ఇంటితోపాటు.. మూడు రైల్వే స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. బాంబ్ స్వ్కాడ్ లతో ఆ ప్రాంతాలను జల్లెడ పట్టారు.

బిగ్ బీ అమితాబచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. అమితాబ్ ఇంటితోపాటు.. ముంబయి నగరంలోని మూడు రైల్వే స్టేషన్లకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ ఫోన్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు చెప్పారు.

వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అమితాబ్ ఇంటితోపాటు.. మూడు రైల్వే స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. బాంబ్ స్వ్కాడ్ లతో ఆ ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయితే.. ఎలాంటి బాంబు లుకానీ.. వేరే ఇతర అనుమానాస్పద వస్తువులు కానీ ఏమీ లేనట్లు గుర్తించారు.

నిన్న రాత్రి ముంబయి పోలీసులకు ఈ బెదిరింపు కాల్‌ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి చత్రపతి శివాశి మహరాజ్‌ టెర్మినస్(CSMT), బైకుల్లా, దాదార్‌ రైల్వేస్టేషన్లు, జుహులోని నటుడు అమితాబ్‌ బచ్చన్ బంగ్లాలో బాంబులు అమర్చినట్టు చెప్పాడు.  కాగా.. ఎక్కడ బాంబు లు కానీ.. అనుమాస్పద వస్తువులు, పదార్థాలు కనిపించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనేదానిపై  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

click me!