Indigo: సీటు కింద బాంబు ఉందంటూ విమానంలో ప్రయాణికుడి హల్ చల్.. తీరా కట్ చేస్తే.. 

Published : Jan 27, 2024, 11:50 PM IST
Indigo: సీటు కింద బాంబు ఉందంటూ విమానంలో ప్రయాణికుడి హల్ చల్.. తీరా కట్ చేస్తే.. 

సారాంశం

Indigo: ఇటీవల కాలంలో ఇండిగో విమానాలు తరచుగా వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉందంటూ.. కలకలం సృష్టించాడు. తీరా కట్ చేస్తే.. 

Indigo: ఇటీవల ఇండిగో విమానాలు తరుచు ఏదోక కారణంతో వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉన్నట్లు నివేదించడంతో విమానంలో కలకలం రేగింది. ఈ వార్త తెలియగానే అప్రమత్తమైన సిబ్బంది.. విమానాన్ని టేకాఫ్ చేయకుండా నిలిపివేశారు. ఈ ఘటన గత అర్ధరాత్రి ముంబయి నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. 

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముంబాయి నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ (ఫ్లైట్ నంబర్ 6E 5264)కు సిద్దంగా ఉంది. ఈ సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా తన సీటు కింద బాంబు ఉందంటూ కేకలు పెట్టాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ముంబై పోలీసులు, ఎయిర్‌పోర్టు ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు, ఎయిర్‌పోర్టు ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకుని విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 

విచారణలో విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని ముంబై పోలీసులు తెలిపారు. దీని తర్వాత.. ముంబై పోలీసులు 27 ఏళ్ల ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై భారత శిక్షాస్మృతిలోని 506(2), 505(1)(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రయాణికుడు ఇలా ఎందుకు చేశాడనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu