అంతుచిక్కని నితీష్ గేమ్, రాజీనామా, ప్రమాణ స్వీకారం ఒకేరోజు.. ఆదివారం బీహార్‌లో ఏం జరగబోతోంది..?

Siva Kodati |  
Published : Jan 27, 2024, 08:29 PM ISTUpdated : Jan 27, 2024, 08:33 PM IST
అంతుచిక్కని నితీష్ గేమ్,  రాజీనామా, ప్రమాణ స్వీకారం ఒకేరోజు.. ఆదివారం బీహార్‌లో ఏం జరగబోతోంది..?

సారాంశం

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఆదివారం పాట్నాలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జేడీఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నాను నితీష్ కుమార్. 

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఆదివారం పాట్నాలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో తిరిగి చేరుతున్న ఆయన .. స్పీకర్ పోస్ట్‌తో పాటు రెండు డిప్యూటీ సీఎం పదవులను బీజేపీకి ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆదివారం జేడీఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నాను నితీష్ కుమార్. 

బీజేపీకి చెందిన రేణుదేవి, సుశీల్ మోడీలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. దీంతో బీహార్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే ముందు నితీష్ కుమార్ జేడీయూ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఆదివారం సెలవుదినం అయినప్పటికీ, సచివాలయాన్ని తెరిచే వుంచాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయట. 

కాగా.. ఇండియా కూటమి కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఆ కూటమిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి బాధ్యతల్లో కీలక పదవి దక్కకపోవడం, సీట్ల పంపకాల్లోనూ కాంగ్రెస్ జాప్యంతో ఆయన తిరిగి బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 28వ తేదీన నితీశ్ కుమార్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నాడు. ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సిన పనిని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో ఆదివారం ఆయన బీజేపీ-జేడీయూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయవచ్చని చెబుతున్నారు. ఆయనకు బీజేపీకి చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారనీ చర్చ జరుగుతున్నది.

నితీశ్ కుమార్ పార్టీ కూటమి మారడం మూలంగా అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలేమీ లేవని తెలుస్తున్నది. ఎన్నికలూ జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. కాబట్టి, ఏ పార్టీ కూడా ఎన్నికల కోసం హడావుడిలో లేవు. ఇప్పుడు పార్టీ ఫోకస్ అంతా కూడా లోక్ సభ ఎన్నికలపై ఉన్నాయి. ఈ సారి లోక్ సభ సీట్ల సంఖ్యను తగ్గించినా నితీశ్ కుమార్ బీజేపీ కూటమిలో చేరడానికి అంగీకరించారని కొన్ని వర్గాలు తెలిపాయి. 

2019లో జేడీయూ 17 లోక్ సభ సీట్లలో పోటీ చేయగా అందులో 16 స్థానాలను గెలుచుకుంది. కానీ, ఈ సారి జేడీయూకు 12 నుంచి 15 సీట్లను మాత్రమే కేటాయిస్తామని, ఇతర పార్టీలకూ సీట్లు కేటాయించాల్సి ఉన్నదని బీజేపీ కండీషన్ పెట్టినా.. అందుకు జేడీయూ అంగీకరించినట్టు సమాచారం. వీటిపై అధికారిక ప్రకటన ఒక్కటి కూడా ఇది వరకు రాలేదు. కానీ, బీజేపీ నుంచి వస్తున్న స్పందనతోనే అనుమానాలు బలపడుతున్నాయి

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu