ఢిల్లీ పూల మార్కెట్‌లో బాంబు కలకలం: నిర్వీర్యం చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Jan 14, 2022, 2:42 PM IST
Highlights

ఢిల్లీలోని ఘాజీపూర్‌లోని పూల మార్కెట్‌లో బాంబు కలకలం రేపింది. అనుమానాస్పద బ్యాగును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ బ్యాగులో బాంబును గుర్తించిన పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని Ghazipur, పూల మార్కెట్ వద్ద వదిలివెళ్లిన బ్యాగులో శుక్రవారం నాడు బాంబు  కలకలం రేపింది. ఈ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ మార్కెట్‌లో fllower క్రయ విక్రయాల కోసం  ప్రజలు పెద్ద ఎత్తున వచ్చిన సమయంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న bagను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Delhi, Uttar pradesh రాష్ట్రాల సరిహద్దులోని నిర్మానుష్య ప్రాంతంలో 8 అడుగుల లోతున్న గుంట తీసి అందులో ఈ బాంబును నిర్వీర్యం చేశారు. 

పూల మార్కెట్ లో ఓ బ్యాగులో IEDని  గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్టుగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ Rakesh Asthana   చెప్పారు. స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్ ను మార్కెట్ లో వదిలి మార్కెట్ లోని ఓ పూల దుకాణంలో పూలు కొనుగోలు చేసి వెళ్లినట్టుగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. పూలు కొనుగోలు చేసేందుకు వచ్చిన కొందరు ఈ బ్యాగ్ ను చూసి పూల దుకాణ యజమానికి సమాచారం ఇచ్చారు.దీంతో పూల దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే మార్కెట్ కు చేరుకొని Bombను నిర్వీర్యం చేసింది. మరో వైపు మార్కెట్ లోకి ప్రజలు రాకుండా స్థానిక పోలీసులు అడ్డుకొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి మాసాల్లో పక్కనే ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి,. ఈ ఎన్నికలకు ఈ బాంబుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కూడా  ఢిల్లీలో పలు చోట్ల బాంబు దాడులు జరగకుండా నిఘా వర్గాలు కట్టడి చేశాయి. కచ్చితమైన సమాచారం ఆదారంగా బాంబు దాడులకు పాల్పడే నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇవాళ పూల మార్కెట్ లో అనుమానాస్పద బ్యాగు విషయమై పోలీసులకు సమాచారం రాగానే బాంబు పేలకుండా భద్రతా సిబ్బంది చర్యలు తీసుకొన్నారు. అంతేకాదు మార్కెట్ లోకి ప్రజలు పెద్ద సంఖ్యలో రాకుండా బయటే నిలువరించారు. మరో వైపు మార్కెట్ లో స్వాధీనం చేసుకొన్న బాంబును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి  నిర్వీర్యం చేశారు.ఢిల్లీని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గతంలో బాంబు దాడులకు పన్నిన కుట్రలను నిఘా వర్గాలు  బట్టబయలు చేశాయి. నిందితులను అరెస్ట్  చేశారు.
 

click me!