
భువనేశ్వర్: ఒడిశా కుఖాయి నదిలో స్నానానికి దిగి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. నది నుండి నాలుగు మృతదేహలను వెలికి తీశారు.
మంగళవారం సాయంత్రం కుఖాయి నదిలో స్నానం చేస్తూ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మునిగిపోయారు.
భువనేశ్వర్ శివారల్లోని బలియాంత పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి రెండు మృతదేహలను నది నుండి వెలికి తీశారు. ఇవాళ ఉదయం మరో రెండు మృతదేహలను బయటకు తీశారు. నిన్న రాత్రి నుండి నదిలో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ ఉదయం మృతదేహలను నది నుండి బయటకు తీశారు. మృతులను జంషెడ్ పూర్‌కు చెందిన ఆర్యన్, కటక్ కు చెందిన అభినాష్, బాలాసోర్ కు చెందిన రోహిత్, కటక్ కు చెందిన ప్రతీక్ గా గుర్తించారు.
భువనేశ్వర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన ఎనిమిది మంది స్నేహితులు కుఖాయి నదిలో స్నానం చేయడానికి వచ్చారు.అయితే వీరిలో నలుగురు నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురు మృతి చెందారు. నదిలో నలుగురు మృతి చెందిన విషయాన్ని గుర్తించిన స్నేహితులు కేకలు వేశారు.
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రే రెండు మృతదేహలను వెలికి తీశారు. మంగళవారంనాడు మధ్యాహ్నం నదిలో స్నానం చేసేందుకు విద్యార్ధులు వచ్చారని బలియాంత పోలీస్ అధికారి జుబరాజ్ స్వైన్ చెప్పారు.
నదిలో విద్యార్థులు గల్లంతైన సమాచారం తమకు మంగళవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు వచ్చిందని ఆయన చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.