బ్రేకింగ్: బోధగయలో వరుస పేలుళ్ళ కేసు: ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు

First Published Jun 1, 2018, 12:35 PM IST
Highlights

బోధగయ పేలుళ్ళ నిందితులకు కోర్టు షాక్

న్యూఢిల్లీ: బుద్దగయలో పేలుళ్ళ కేసుకు సంబంధించి
ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులకు జీవితఖైదును విధిస్తూ
శుక్రవారం నాడు తీర్పును విధించింది.

2013  జూలై 7వ తేదిన బోధగయలో వరుసగా బాంబు పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితులకు కోర్టు శుక్రవారం నాడు జీవిత ఖైదును విధిస్తూ తీర్పును వెల్లడించింది.

అయితే ఈ ఘటనకు ఇండియన్ ముజాహీదీన్ సంస్థ పాల్పడిందని ఎన్ఐఏ 2013 నవంబర్ 4వ తేదిన ప్రకటించింది. ఈ బాంబు పేలుళ్ళకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ లో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం నాడు కోర్టు తీర్పు చెప్పింది.

 

బోదగయ పేలుళ్ళ ఘటనలో ఆ సమయంలో ఏడుగురు మరణించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను గత శుక్రవారం నాడు పూర్తి చేసింది. అయితే  తీర్పును పాట్నాలోని ఎన్ఐఏ కోర్టు తీర్పును వెల్లడించింది.

బాంబుపేలుళ్ళకు పాల్పడిన  మీర్ సిద్దికీ, హైదర్ అలీ, ముజబుల్లా అన్సారీ,ఇంతియాజ్ అన్సారీలతో పాటు మరోకరికి జీవిత ఖైదు విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పును వెల్లడించింది.జీవితఖైదుతో పాటు రూ.10వేల జరిమానాను విధించింది.

 


 

click me!