వరద సహాయక చర్యల్లో విషాదం: కాపాడి తీసుకొస్తుండగా.. 9 మంది జలసమాధి

Siva Kodati |  
Published : Aug 08, 2019, 02:43 PM ISTUpdated : Aug 08, 2019, 08:59 PM IST
వరద సహాయక చర్యల్లో విషాదం: కాపాడి తీసుకొస్తుండగా.. 9 మంది జలసమాధి

సారాంశం

మహారాష్ట్రలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సాంగ్లీ నగరం నుంచి వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా... పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మరణించగా.. పలువురు గల్లంతయ్యారు

మహారాష్ట్రలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు.

ఈ క్రమంలో సాంగ్లీ నగరం నుంచి వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా... పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మరణించగా.. పలువురు గల్లంతయ్యారు.

వీరిలో తొమ్మిది మందిని సహాయక బృందాలు రక్షించాయి..  ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 30 మంది వరద బాధితులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !