Bihar: పడవలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురు కూలీల దుర్మరణం.. 

Published : Aug 06, 2022, 08:11 PM IST
Bihar: పడవలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురు కూలీల దుర్మరణం.. 

సారాంశం

Bihar: బీహార్‌లోని పాట్నాలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ప‌డ‌వ‌లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డంతో అందులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు కూలీలు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించగా.. పలువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న ప‌ట్నాలోని రాంపూర్ దియ‌ర ఘాట్‌లో జ‌రిగింది.  

Bihar: బీహార్‌లోని పాట్నాలో విషాదం చోటుచేసుకుంది. పాట్నాస‌మ‌యంలో శనివారం  ఓ పడవలో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో  అందులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు కూలీలు మృత్యువాత ప‌డ్డగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న ప‌ట్నాలోని రాంపూర్ దియ‌ర ఘాట్‌లో చోటుచేసుకుంది.  

జాతీయ మీడియా క‌థనాల‌ సమాచారం ప్రకారం..  పాట్నాలోని రాంపూర్ దియారా ఘాట్ లో పడవలో మంటలు చెలరేగడంతో ఐదుగురు కూలీలు మరణించారు. ప్ర‌మాదం స‌మ‌యంలో పడవ నిండా ఇసుక ఉందని, పడవలోని వ్యక్తులు హల్దీ ఛప్రా గ్రామానికి చెందిన వారుగా తెలుస్తుంది. ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం చాలా ఘోరంగా ఉండడంతో బోటు పేలిపోయింది. ప్రస్తుతం మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు బోటులో దాదాపు 20 మంది ఉన్నారని, ఈ బోటు ద్వారా ఒకచోటి నుంచి మరో ప్రాంతానికి అక్రమంగా ఇసుక ర‌వాణా చేస్తున్న‌ట్టు, ప్రమాదంలో మృతి చెందిన కూలీలు ఇసుక తవ్వకాలకు సంబంధించిన వారేనని స్థానికులు చెబుతున్నారు. ప్ర‌మాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మృతదేహాలను పోలీసులు మార్చారీకి త‌ర‌లింఆచ‌రు. ఈఘ‌ట‌న‌పై  దర్యాప్తు చేయబడుతోంది.
 
ఈ ఘ‌ట‌న‌పై పోలీసు ఉన్న‌తాధికారులు మాట్లాడుతూ.. సిలిండ‌ర్‌లు పేల‌డం వ‌ల్ల అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని చెబుతున్నా అది వాస్త‌వం కాద‌ని, వారు ప్ర‌యాణిస్తున్న బోట్ లో డీజిల్ క్యాన్ లు ఉన్నాయ‌నీ, ప్రమాద‌వ‌శాత్తూ మంట‌లు చెల‌రేగ‌డంతో ఈ దారుణం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నామ‌ని తెలిపారు.   ప్ర‌మాదానికి గ‌ల ఇంకా తెలిసి రాలేద‌నీ, అగ్నిప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో అక్ర‌మ ఇసుక‌ను త‌ర‌లిస్తున్న‌ట్టు అనుమానిస్తున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 20 మంది కూలీలు ఉన్నార‌ని  అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు