
జైపూర్ : రాజస్థాన్(Rajasthan)లోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులను ఎంపిక(REET) చేయడానికి చేపట్టిన ఒక ముఖ్యమైన పరీక్షలో మోసం చేయడానికి ప్రయత్నించిన ఐదుగురిని వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు అభ్యర్థులు "చప్పల్స్" ధరించి వాటి సోల్ లోపల బ్లూటూత్ (Bluetooth Chappals)పరికరాలను అమర్చి మాస్ కాపియింగ్ కు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
మొదటగా అజ్మీర్‌లో ఒక వ్యక్తిని ఇలాంటి మోసం కేసులో అరెస్ట్ చేశారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రాకెట్ జరుగుతుందని కనుక్కుని షాక్ కు గురయ్యారు. తీవ్రంగా గాలించగా పలు ప్రాంతాల్లో ఇలా చప్పల్ లో బ్లూ టూత్ పెట్టి కాపీయింగ్ కి పాల్పడతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదో పెద్ద రాకెట్ గా మారిందని వారు భయాందోళనలు వ్యక్తి చేశారు.
రాజస్థాన్ లో టీచర్స్ లేదా REET అర్హత పరీక్షకు చాలా డిమాండ్ ఉంది. ఈ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు కొంతమంది ఈ ఛీటింగ్ కు పాల్పడ్డారు. ఈ చప్పల్ బ్లూ టూత్ రాకెట్ ను పోలీసులు వెంటనే కనుగొన్నారు. బికనీర్, సికార్‌లో బ్లూటూత్, మొబైల్ పరికరాలతో ఇలాంటి చప్పల్స్ కనుగొన్నారు.
"చప్పల్ లోపల మొత్తం ఫోన్ వ్యవస్థ అంతా ఉంది. దీంతోపాటు ఓ బ్లూటూత్ డివైజ్ కూడా ఉంది. అభ్యర్థి చెవిలో ఓ పరికరం ఉంది. పరీక్ష హాల్ బయట ఎవరైనా ఉండి ఈ మోసం చేయడంలో సహాయపడుతున్నారని" పోలీసు అధికారి రతన్ లాల్ భార్గవ్ చెప్పారు.
పోలీసులు ఇప్పటికీ ఈ విస్తృతమైన చీటింగ్ ప్లాట్‌ను చేధిస్తున్నారు. ఇదొక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా అనిపిస్తుందని తెలిపారు. ఈ "చీటింగ్ చప్పల్స్" "తెలివిగా తయారు చేయబడ్డాయి" అన్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఈ హార్డ్‌వేర్ చెప్పల్స్ ను చీటింగ్ చేయడానికి అభ్యర్థులకు రూ. 2 లక్షల వరకు అమ్ముతున్నారని తెలుస్తోంది.
సహోద్యోగిపై అత్యాచారం.. భారత వైమానిదళ అధికారి అరెస్ట్...
"పరీక్షలో మోసం చేయడానికి ఒక వ్యక్తి తన చెప్పుల్లో పరికరాలు పెట్టుకుని వచ్చాడని మేం కనిపెట్టాం. పరీక్ష ప్రారంభంలోనే మేము అతన్ని పట్టుకున్నాం. అతనికి ఎక్కడ లింక్‌లు ఉన్నాయి. ఇంకా ఎంతమంది ఇలా మోసానికి పాల్పడ్డారని మేము ఆరా తీస్తున్నాం. వెంటనే ఇతర జిల్లాలను కూడా అప్రమత్తం చేశాం. పరీక్ష తదుపరి దశలో, ఎవరూ చెప్పులు, బూట్లు లేదా సాక్స్‌తో పరీక్షా కేంద్రంలోకి వెళ్లలేరు "అని అజ్మీర్ పోలీసు అధికారి జగదీష్ చంద్ర శర్మ చెప్పారు.
రాజస్థాన్ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ గా అర్హత సాధించాలంటే REET పాస్ కావాల్సి ఉంటుంది. దీనికోసం వివిధ రకాలుగా చీటింగ్ కు పాల్పడుతున్నారు. రీట్‌లో మోసాన్ని నిరోధించడానికి రాజస్థాన్‌లోని అనేక జిల్లాలలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సర్వీసులు 12 గంటల పాటు నిలిపేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 31,000 పోస్టులకు దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
REET పరీక్ష రాయడానికి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నందున.. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి, కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు, భద్రతలు, ప్రయాణాల కోసం విస్తృతమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.