కర్ణాటక సంక్షోభం.. మాకేం సంబంధం లేదు.. రాజ్ నాథ్ సింగ్

By telugu teamFirst Published Jul 8, 2019, 1:58 PM IST
Highlights

కర్ణాటకలో  రాజకీయ సంక్షోభం నెలకొంది. ఒకరి తర్వాత మరికొరు రాజీనామాలు చేస్తూ.. సీఎం కుమార స్వామికి షాకిస్తున్నారు. 

కర్ణాటకలో  రాజకీయ సంక్షోభం నెలకొంది. ఒకరి తర్వాత మరికొరు రాజీనామాలు చేస్తూ.. సీఎం కుమార స్వామికి షాకిస్తున్నారు. రాజీనామాలు చేసిన వారంతా బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో... ఇదంతా బీజేపీ చేస్తున్న ప్లాన్ అని పలువురు భావిస్తున్నారు. కాగా దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.

 కర్ణాటక సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. లోక్‌సభలో జీరో అవర్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అధిర్‌ రంజన్‌.. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ప్రశ్న లేవనెత్తారు. కర్ణాటక సంక్షోభానికి భారతీయ జనతాపార్టీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ స్పందిస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయదు అని స్పష్టం చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. రాజీనామాల పరంపర రాహుల్‌ గాంధీతోనే ప్రారంభమైందన్నారు. రాజీనామాలు చేయాలని రాహులే అందరినీ అడుగుతున్నారని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

click me!