అదృశ్య శక్తులను నాపై ప్రయోగిస్తున్నారు.. నేను శివుడి భక్తుడిని : బీజేపీ ఎమ్మెల్యే

Published : Oct 01, 2023, 05:43 PM IST
అదృశ్య శక్తులను నాపై ప్రయోగిస్తున్నారు.. నేను శివుడి భక్తుడిని : బీజేపీ ఎమ్మెల్యే

సారాంశం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు బాణామతితో దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ, తాను శివుడి భక్తుడినని, తనకేమీ కాదని ఫేస్‌‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు అదృశ్య శక్తులతో లక్ష్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. వేరే ప్రపంచపు శక్తుల ఆధారంగా నన్ను టార్గెట్ చేసుకుంటున్నారని అన్నారు. అయితే, తనకేమీ కాదని, తాను భోలేనాథుడి భక్తుడినని పేర్కొన్నారు. 

కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేసుకుని చేతబడి చేయిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలకు సాక్ష్యంగా ఓ ఫొటోను తన ఫేస్ బుక్ వాల్ పై పోస్టు చేశారు. ఓ బుట్టను బజారులో పెట్టారు. ఆ బుట్టలో ఎర్ర రంగు వస్త్రం పరిచి అందులో ఎమ్మెల్యే ఫొటో, కొన్ని రకాల ధాన్యాలు, ఒక పండు లేదా కూరగాయను కోసి పెట్టారు. ఈ ఫొటోను బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ పోస్టు చేశారు. 

యూపీలో లఖింపూర్ ఖేరిలోని మొహమ్మది నియోజకవర్గానికి ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

ఈ ఫొటోను పోస్టు చేసి అలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకేమీ కాదని, తాను శివుడికి పరమభక్తుడినని పేర్కొన్నారు. మనం చంద్రుడిని అందుకుంటున్నామని, కానీ, ఇంకా చాలా మంది ఇలాంటి బాణామతిని నమ్ముతున్నారని తెలిపారు. వారికి ఆ దేవుడు విజ్ఞానాన్ని అందించాలని కోరారు.

Also Read: తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు: మహాబూబ్‌నగర్ లో ప్రధాని మోడీ వరాల జల్లు

‘నేను భోలేనాథ్‌కు పరమ భక్తుడిని. అలాంటి ట్రిక్కులు నాపైన పని చేయవు. ఈ విజ్ఞాన శతాబ్దంలో మనం చంద్రుడిని అందుకోగలుగుతున్నాం, అదే సమయంలో ఇలాంటి ట్రిక్కులను నమ్మే మనో వైకల్యులు ఉండటం బాధాకరం’ అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood