‘నేను ఆవుపేడను విసిరాను.. రాళ్లు రువ్వలేదు’.. మద్యం దుకాణంపై మాజీ సీఎం దాడి..

Published : Jun 16, 2022, 10:07 AM IST
‘నేను ఆవుపేడను విసిరాను..  రాళ్లు రువ్వలేదు’.. మద్యం దుకాణంపై మాజీ సీఎం దాడి..

సారాంశం

బీజేపీ నేత, మాజీ సీఎం ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. మద్యం దుకాణం మీద ఆవుపేడను విసిరి తన నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. 

భోపాల్ : Madhya Pradesh మాజీ సీఎం, బీజేపీ ఫైర్ బ్రాండ్ Uma Bhartiకి మరోసారి కోపం వచ్చింది. రాష్ట్రంలో మద్యం నిషేధించాలి అంటూ కొంతకాలంగా ఉద్యమిస్తున్న ఆమే ఈసారి ఓ మద్యం దుకాణంపై ఏకంగా cow dungతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మధ్య ప్రదేశ్ లోని నివారి జిల్లాలో ఆధ్యాత్మిక నగరమైన ఓర్చాలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మద్యం దుకాణం ఏర్పాటు చేసిన స్థలానికి అనుమతి లేదని, ఎంతో పవిత్ర నగరమైన ఓర్చాలో ఇలాంటి దుకాణం తెరవడం నేరమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పేడ విసిరిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియో తీసిన వ్యక్తి తో..‘చూడండి.. నేను ఆవుపేడను విసిరాను..  రాళ్లు రువ్వలేదు’  అని ఆమె అన్నట్టుగా రికార్డయింది. ఈ ఏడాది మార్చిలో భోపాల్ లోని ఓ మద్యం దుకాణంపై రాళ్ళతో దాడి చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నిన్నటి ఘటన తర్వాత ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఓర్చా నగరం ప్రధాన ద్వారం  వద్ద  మద్యం దుకాణం ఉంది. ఇప్పుడు ఆ దుకాణం ఉన్న ప్రదేశంలో దానికి అనుమతి లేదు. దీనిపై ప్రజలు, మా సంస్థ సభ్యులు  నిరంతరం నిరసనలు చేపడుతున్నారు. ఈ దుకాణాన్ని  అక్కడినుంచి తీసేయాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు.

వినతి పత్రాలు ఇస్తున్నారు. పవిత్రమైన నగరం నుదుటిన ఈ దుకాణం పెద్ద కళంకంగా ఉన్నందున దాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి వస్తున్న స్పందనలను నేరంగా పేర్కొనలేం.. ఎందుకంటే  అక్కడ ఈ దుకాణం తెరవడమే ఓ పెద్ద నేరం’  అని పేర్కొన్నారు. ‘ఏప్రిల్ లో శ్రీరామనవమి సందర్భంగా ఓర్చాలో నిర్వహించిన  దీపోత్సవ్ కార్యక్రమం రోజున 5 లక్షల దీపాలు వెలిగించినప్పుడు ఈ దుకాణం తెరిచి ఉందని నాకు సమాచారం అందింది. ఇది అయోధ్యలా  పవిత్రమైనది. అందుకే  పవిత్రమైన గోశాలలోని ఆవుపేడను మద్యం దుకాణాలపై విసిరికొట్టాను. మా భావజాలానికి చెందిన సంస్థలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఇంకా ఆ దుకాణం తెరిచి ఉంచడం సిగ్గుచేటు’  అన్నారు. అయితే,  ఈ మద్యం దుకాణం మంజూరైన స్థలంలోనే ఉందని  ఓర్చా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అభయ్ సింగ్ అన్నారు. ఆవుపేడతో  దాడి చేసిన తర్వాత కాంట్రాక్టర్ ఈ దుకాణాన్ని తాత్కాలికంగా  మూసివేసినట్టు  తెలిపారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?